Home
Mobile

మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ కీ2, ధర రూ.42,990

బ్లాక్‌బెర్రీ కీ2 (BlackBerry KEY2) స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లో లాంచ్ అయ్యింది.

By Bommu Sivanjaneyulu

బ్లాక్‌బెర్రీ కీ2 (BlackBerry KEY2) స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లో లాంచ్ అయ్యింది. కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను నోయిడాకు చెందిన Optiemus Infracom అనే సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధర రూ.42,990. జూలై 31 నుంచి అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై రూ.4,450 ఖరీదు చేసే రిలయన్స్ జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు 5 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ వెల్లడించింది. వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. బ్లాక్‌బెర్రీ కీ2 స్మార్ట్‌ఫోన్ డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకించి క్వర్టీ కీప్యాడ్ ఫోన్ ప్రియుల కోసం డిజైన్ చేయటం జరిగింది. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

blackberry key2
బ్లాక్‌బెర్రీ కీ2 స్పెసిఫికేషన్స్...
4.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (1080x1620 పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 64 బిట్ ఆక్టా కోర్ 660 సాక్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకనే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, హెచ్‌డిఆర్, 4కే వీడియో రికార్డింగ్, డ్యుయల్ పీడీఏఎఫ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ స్ర్కీన్ ఫ్లాష్ అండ్ ఫుల్ హెచ్‌డి వీడియో రికార్డింగ్, 3500mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్,

కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి..
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ విత్ 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, beidou, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్. సెన్సార్ విషయానికి వచ్చేసరికి.. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, హాల్ ఎఫెక్ట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, మాగ్నటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్.
ప్రోయాక్టివ్ హెల్త్ చెకప్ ఫీచర్
బ్లాక్‌బెర్రీ కీ2 స్మార్ట్‌ఫోన్‌లో DTEK పేరుతో ప్రత్యేకమైన ఇన్‌బిల్ట్ యాప్‌‌ను బ్లాక్‌బెర్రీ నిక్షిప్తం చేసింది. ఈ యాప్‌లో ఇప్పుడు ప్రోయాక్టివ్ హెల్త్ చెకప్ ఫీచర్ కూడా యాడ్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్‌లో యాడ్ చేసిన Speed Key ద్వారా ఎక్కువుగా యూజ్ చేసిన యాప్స్ ఇంకా ప్రొఫైల్స్‌ను వేగంగా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Home-grown company Optiemus Infracom, which manufactures and distributes iconic BlackBerry devices, on 23 July launched BlackBerry KEY2 smartphone with extra security to keep your data safe at Rs 42,990.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X