హైలెట్ ఛార్జింగ్ ఫీచర్‌తో బ్లాక్‌బెర్రీ కీవన్

Written By:

బ్లాక్‌బెర్రీ లమ అభిమానుల కోసం బ్లాక్‌బెర్రీ కీవన్ స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేసింది. భారత్‌తోపాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఈ ఫోన్ ఏకకాలంలో విడుదలైంది. ఈ ఫోన్ ముందు భాగంలో తెర కింద ప్రత్యేకంగా ఓ ఫిజికల్ కీ ప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు బ్లాక్‌బెర్రీ ఫోన్లలో ప్రత్యేక ఆకర్షణ అయిన ఫిజికల్ కీబోర్డ్‌ను ఇప్పుడీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఏర్పాటు చేశారు.

రెడ్‌మి 4 ఫ్లాష్ సేల్ ఈ రోజే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్పేస్ బార్ బటన్ కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

దీంతో పాటు ఈ కీబోర్డ్‌లో ఉన్న స్పేస్ బార్ బటన్ కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.

అల్యూమినియం తో ఫోన్ బాడీ

ఫోన్ బాడీ విషయానికొస్తే అల్యూమినియం తో ఫోన్ బాడీని తయారు చేశారు.

క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీ

ఇందులో ఉన్న క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీ వల్ల ఫోన్ 0 నుంచి 50 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవలం 36 నిమిషాలు మాత్రమే పడుతుంది.

బ్లాక్ కలర్‌లో మాత్రమే

ఇక ఈ ఫోన్ కేవలం బ్లాక్ కలర్‌లో మాత్రమే రూ.39,990 ధరకు యూజర్లకు అమెజాన్ సైట్ నుంచి లభిస్తున్నది. ఆగస్టు 8వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.

బ్లాక్‌బెర్రీ కీవన్ ఫీచర్లు...

4.5 ఇంచ్ డిస్‌ప్లే, 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3505 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Blackberry KEYone smartphone launched in India at Rs 39,990 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot