మీడియా చేతిలో ‘మోస్ట్ వాంటెడ్’ ఫోటో!

బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్‌ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) త్వరలో ఆవిష్కరించనున్న బీబీ10 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఓ ఫోటోగ్రాఫ్ ఆన్‌లైన్‌లో లీకైంది. ఆ ఫోటోలో ప్రత్యక్షమైన మూడు స్మార్ట్‌ఫోన్‌లు బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించేవన్న వాదనలు వ్యక్తమవటంతో ఆ ఫోటోగ్రాఫ్ మార్కెట్ వర్గాల్లో సంచలనం రేకిత్తిస్తోంది. సదరు ఫోటోలో కనిపిస్తున్న హ్యాండ్‌సెట్‌లలో ఒక డివైజ్‌ను (మధ్య) ఎల్ - సిరీస్ ఫోన్‌గా భావిస్తున్నారు. మరో క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌ను ఎన్- సిరీస్ డివైజ్‌గా అంచనావేస్తున్నారు. సగం మాత్రమే కనిపిస్తున్న మరో హ్యాండ్‌సెట్‌ను ‘దేవ్ ఆల్ఫా సిరీస్’ ఫోన్‌గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్లాక్‌బెర్రీ జడ్10 మోడల్‌లో విడుదల కాబోతున్న ఎల్- సిరీస్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ లండన్ హ్యాండ్‌సెట్ పై బ్లాక్‌బెర్రీ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
గత నివేదికల ద్వారా సేకరించిన వివరాలు మేరకు ఎల్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు..?
4.3 అంగుళాల డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,
డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై 802.11 బి/జి/ఎన్,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ).


Click it and Unblock the Notifications








