బ్లాక్‌బెర్రీ సిడిఎమ్ఎ సూపర్ ఫోన్స్..

Posted By: Super

బ్లాక్‌బెర్రీ సిడిఎమ్ఎ సూపర్ ఫోన్స్..

బ్లాక్‌బెర్రీ ఇండియన్ మొబైల్ కస్టమర్స్ కొసం ప్రత్యేకంగా రెండు సిడిఎమ్ఎ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ రెండు మొబైల్స్ కూడా సిడిఎమ్ఎ ఆపరేటర్స్ కోసం విడుదల చేయడం ఇక్కడ ప్రత్యేకం. బ్లాక్‌బెర్రీ కంపెనీ ఇండియాలో సిడిఎమ్ఎ సర్వీస్‌లను అందిస్తున్న ఈ మూడింటి టాటా టెలిసర్వీసెస్, ఎమ్‌టిఎస్, రిలయన్స్‌ల భాగస్వామ్యంతో 2011 సంవత్సరం చివరకు గానీ, 2012 మొదట్లో గానీ ఎవరితో ఒకరితో జత కట్టి ఇండియాలో ప్రవేశించాలని ప్లాన్.

బ్లాక్‌బెర్రీ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్న రెండు సిడిఎమ్‌ఎ మొబైల్ పేర్లు బ్లాక్‌బెర్రీ కర్వ్ 9350, బ్లాక్‌బెర్రీ కర్వ్ 9370. ఈ రెండు మొబైల్స్ ఫీచర్స్‌ని క్లప్తంగా పరిశీలించినట్లైతే..

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9370 మొబైల్ ప్రత్యేకతలు:

* Display – It has a HVGA color display
* Full QWERTY keypad
* It runs with Blackberry OS 7
* 800 MHz of Processor
* 5 Mega Pixels Camera with LED flash
* Wireless LAN WiFi facility
* NFC support
* Internal 512 Mb RAM
* Micro SD card slot facility
* SMS, MMS,Email, Push Mail and IM
* Video recording facility
* Impressive battery backup

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9350 మొబైల్ ప్రత్యేకతలు:

* Dimension: 109 x 60 x 11 mm
* Operating System: BlackBerry 7 OS
* Processor: 800 MHz
* Display: 2.44 inch LCD QVGA display
* 480 x 360 pixels screen resolution
* QWERTY keypad
* Camera: 5 MP with Flash
* 512 MB RAM
* External Memory: Upto 32GB
* 3.5 mm audio jack
* Wi-Fi, Bluetooth, USB connectivity
* a-GPS, pre-loaded BlackBerry Maps
* Battery: 1000 mAh
* Weight: 99 grams

ఈ రెండు మొబైల్స్‌ని కూడా బ్లాక్‌బెర్రీ తయారుదారు రీసెర్చ్ ఇన్ మోషన్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ చిఫ్స్‌ని ఉపయోగించి రూపొందించడం జరిగింది. ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సహాయంతో యూజర్స్ డేటాని ఈజీగా షేర్ చేసుకొవచ్చు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే బ్లాక్‌బెర్రీ‌లో ఆడియో, వీడియో ప్లేయర్స్ మార్కెట్లో లభించే అన్ని రకాల ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి.

ఇందులో ఉన్న మరో ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే 'యూనివర్సిల్ వాయిస్ యాక్టివేటెడ్ సెర్చ్'. ఈ ఫీచర్ గురించి ఇంత వరకు ఎక్కడా మీరు విని ఉండకపోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో యూజర్స్ మాట్లాడిన వాయిస్ టెక్ట్స్ రూపంలో ట్రాన్సలేట్ అయి మీకు కావాల్సిన పదాలను సెర్చ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపోతే బ్లాక్‌బెర్రీ హ్యాండ్ సెట్స్‌కున్న మరో ప్రత్యేకత పవర్ పుల్ బ్యాటరీ. ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించి బ్లాక్‌బెర్రీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ యూజర్స్ కొసం ప్రత్యేకంగా ఈ సమాచారం అందించడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot