బీజెల్ లెస్ డిస్‌ప్లే‌తో రెండు ఘోస్ట్ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్లు

|

ఈ త్రైమాసికం చివరిలో "ఘోస్ట్" అనే పేరుతో బీజెల్ లెస్ స్మార్ట్‌ఫోన్‌తో విపణి‌లోనికి అడుగుపెట్టనుంది బ్లాక్ బెర్రీ. ఇండియా , శ్రీలంక , బంగ్లాదేశ్ మరియు నేపాల్లో బ్లాక్ బెర్రీ డిజైనింగ్ మరియు తయారీ లైసెన్స్ కలిగిన ఆప్టిమస్, రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను విపణిలోనికి తీసుకుని రావడానికి సిద్దంగా ఉన్నది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ దృఢమైన సెక్యూరిటీ మరియు బ్లాక్ బెర్రీ హబ్ ఫీచర్లతో రానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల డిజైన్ మరియు తయారీ మీద, నోయిడాలోని ఆప్టిమస్ యూనిట్ భాద్యతను తీసుకుని బ్లాక్ బెర్రీ మోనికర్ పర్యవేక్షణలో పనిచేస్తున్నది. తద్వారా స్మార్ట్ఫోన్ మార్కెట్ లో , ముఖ్యంగా ఈ ధర పరిధిలో 10 నుండి 12 శాతం మార్కెట్ షేర్ ను సాధించాలనే పట్టుదలతో ఉంది బ్లాక్ బెర్రీ. ఈ స్మార్ట్ ఫోన్స్ విడుదలతో పాటు, మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ ను కూడా కొన్ని ధరల తేడాలతో వచ్చే త్రైమాసికాలలో విడుదల చేయాలని ఆలోచన చేస్తూ ఉంది.

 
బీజెల్ లెస్ డిస్‌ప్లే‌తో రెండు ఘోస్ట్ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్లు

వినియోగదారులకు చేరువవడం కోసం అన్ని రకాల ధరల సెగ్మెంట్స్ లో మొబైల్స్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు, తద్వారా ఈ రెండు మోడల్స్ ఈ త్రైమాసికంలో విడుదల చేస్తుండగా, రాబోవు త్రైమాసికాలలో మరికొన్ని మోడల్స్ ను విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. సరికొత్త ఆలోచనలతో, మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రకాల ధరల వేరియంట్లలో ఈ మొబైల్స్ లభించబోతున్నాయని ఆప్టిమస్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ హర్దీప్ సింగ్ తెలిపారు.

ఐపీఎల్ సందర్భంగా దిగ్గజాలు ఇస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవే ఐపీఎల్ సందర్భంగా దిగ్గజాలు ఇస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవే

Leakster గా పేరు గడించిన ఇవాన్ బ్లాస్ ( @evaleaks) ఫిబ్రవరిలోనే ఈ మొబైల్ డిజైన్ ను విడుదల చేశారు. తద్వారా ఈ బ్లాక్బెర్రీ ఘోస్ట్ , 18:9 ఆస్పెక్ట్ రేషియో తో బీజెల్ లెస్ స్క్రీన్ డిజైన్ తో రానున్నదని తెలుస్తుంది. ఇక రెండవ ఫోన్ విషయానికి వస్తే హర్దీప్ సింగ్ చెప్పిన ప్రకారం, దీని పేరు "ఘోస్ట్ ప్రొ" గా ఉండవచ్చని ఇది కొంచం చిన్న డిస్ప్లే తో 16:9 ఆస్పెక్ట్ రేషియో తో ఉండనుందని హింట్ ఇచ్చారు.

బీజెల్ లెస్ డిస్‌ప్లే‌తో రెండు ఘోస్ట్ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్లు

అయితే హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ పై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, రాబోవు అన్నీ స్మార్ట్ ఫోన్స్ DTEK app ద్వారా అనుసంధానించబడి డివైజులను బ్లాక్బెర్రీ హబ్ తో కలిపి, రియల్ టైమ్ సెక్యూరిటీ మానిటర్ చేసేలా రూపొందుతుందని తెలిపారు. బ్లాక్ బెర్రీ అంటేనే గుర్తుకు వచ్చేది qwerty కీబోర్డ్ , కానీ రాబోవు స్మార్ట్ ఫోన్స్ లో ఈ qwerty physical కీబోర్డ్ ఉన్న ధాకలాలేవీ లేవు. ఒకప్పుడు బ్లాక్బెర్రీ కీ-వన్ మోడల్ లో ఈ ఫీచరే హైలెట్. అప్పుడు కూడా బ్లాక్బెర్రీ కీ వన్ ఆప్టిమస్ చేతులమీదనే తయారు చేయబడినది. ఆగస్ట్2017 లో విడుదల కాబడిన ఆ ఫోన్ 35,100 రూపాయలుగా ధర కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
BlackBerry to launch two new smartphones in India this quarter More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X