బ్లాక్‌బెర్రీ చివరి ఫోన్ ఇదేనా..?

బ్లాక్‌బెర్రీ ఎట్టకేలకు తన DTEK60 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ నుంచి వచ్చే చివరి ఫోన్ ఇదే కావొచ్చని మార్కెట్ వర్గాలు అభప్రాయపడుతున్నాయి.

|

కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ ఎట్టకేలకు తన DTEK60 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ నుంచి వచ్చే చివరి ఫోన్ ఇదే కావొచ్చని మార్కెట్ వర్గాలు అభప్రాయపడుతున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం సిస్టం పై రన్ అయ్యే ఈ ఫోన్ ధర 499 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.33,325). బ్లాక్‌బెర్రీ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Read More : ఎడ్జ్‌లెస్ డిస్‌ప్లేతో 'Mi Mix'

ఫోన్ స్పెసిఫికేషన్స్

ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు,

4కే క్వాలిటీ కెమెరా

4కే క్వాలిటీ కెమెరా

డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ లో  ఏర్పాటు చేసిన 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను షూట్ చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో పొందుపరిచిన 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లు..

కనెక్టువిటీ ఫీచర్లు..

4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థను ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసారు.

సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ..

సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ..

సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ డిజైన్ చేయబడిన ఈ ఫోన్‌లో ‘DTEK by BlackBerry' పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసారు. ఈ యాప్.. ఫోన్‌లోని ఆపరేటింగ్ సిస్టంతో పాటు అన్ని విబాగాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ డేటాకు రక్షణ కల్పిస్తుంది.

 

యాపిల్, సామ్‌సంగ్‌ల దెబ్బకు..

యాపిల్, సామ్‌సంగ్‌ల దెబ్బకు..

యాపిల్, సామ్‌సంగ్‌ల దెబ్బకు బ్లాక్‌బెర్రీ తన స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్‌ను కోల్పొయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన DTEK60 స్మార్ట్‌ఫోన్ అటు స్పెసిఫికేషన్స్ పరంగా, ఇటు ధర పరంగా ఐఫోన్ 7, గూగుల్ పిక్సల్ వంటి టాప్ ఎండ్ ఫోన్‌లకు పోటీగా నిలిచింది.

ఫోన్‌ల తయారీని పూర్తిగా నిలిపివేసి..

ఫోన్‌ల తయారీని పూర్తిగా నిలిపివేసి..

ఫేలవమైన అమ్మకాలతో నిర్వహణ వ్యయం పెరిగిపోతుండటతో స్మార్ట్‌ఫోన్‌ల తయారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు బ్లాక్‌బెర్రీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మీదట సాఫ్ట్‌వేర్ బిజినెస్ అభివృద్థి పై దృష్టిపెడుతున్నట్లు బ్లాక్‌బెర్రీ తెలిపింది.

Best Mobiles in India

English summary
BlackBerry launches its 'last' smartphone DTEK60. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X