బ్లాక్‌బెర్రీ లీప్.. మార్కెట్లోకి కొత్త 4జీ ఫోన్

Posted By:

బ్లాక్‌బెర్రీ లీప్.. మార్కెట్లోకి కొత్త 4జీ ఫోన్

కెనాడాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీదారు బ్లాక్‌బెర్రీ, ‘లీప్'( Leap) పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. వచ్చే వారం నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ ఫోన్ ధరకు సంబంధించి బ్లాక్‌బెర్రీ ఏ విధమైన వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ డివైస్ ధర రూ.18,000లోపు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బ్లాక్‌బెర్రీ లీప్.. మార్కెట్లోకి కొత్త 4జీ ఫోన్

బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టంలోని 10.3.1 సాఫ్ట్‌వేర్ వర్షన్‌ పై ఫోన్ రన్ అవుతుంది. 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 720పిక్సల్స్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 ఎక్స్ డిజిటల్ జూమ్‌తో కూడిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3ఎక్స్ డిజిటల్ జూమ్ ఫీచర్‌‍తో కూడిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

బ్లాక్‌బెర్రీ లీప్ స్మార్ట్‌ఫోన్‌ను మొట్టమొదటి సారిగా బార్సిలోనాలో జరిగిన 2015 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శించారు.

English summary
BlackBerry Leap: Budget 4G LTE Smartphone Launched in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot