అదిరేటి ఫీచర్స్‌తో ఇండియన్ మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ

Posted By: Super

అదిరేటి ఫీచర్స్‌తో ఇండియన్ మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ

స్మార్ట్ ఫోన్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది బ్లాక్ బెర్రీ. నోకియా, శ్యామ్ సంగ్, హెచ్‌టిసి మొబైల్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తలను అందిస్తుంది. అందులో భాగంగానే మార్కెట్లోకి కొన్ని కొత్త మోడల్స్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. మొదటగా లండన్‌లో బ్లాక్ బెర్రీ తన కొత్త మొబైల్ ఫోన్ బోల్డ్ టచ్ 9900ని విడుదల చేసి, ఆతర్వాత ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే లండన్‌లో బ్లాక్ బెర్రీ బోల్డ్ టచ్ 9900‌కి సంబంధించి అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ మొదలైనాయి.

బ్లాక్ బెర్రీ మోడల్స్‌లలో సూపర్ కూల్‌గా పిలచేటటువంటి ఈ మోడల్ 2.8ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే సిస్టమ్‌‌ని కలిగి ఉండి టచ్ అండ్ టైప్ ఇంటర్ ఫేస్ దీని ప్రత్యేకం. దీనిలో ఉండేటటువంటి ఇంకోక ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఉండేటటువంటి చిఫ్ ఎన్‌ఎఫ్‌సి ఛిఫ్. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ రంగంలో దీని హావా కొనసాగుతుంది. బ్లాక్ బెర్రీ బోల్డ్ టచ్ 9900 చక్కని మల్టీమీడియా ఫీచర్స్‌తో మ్యూజిక్ ఫైల్స్‌(MP3, WAV, WMV)ని ప్లేబ్యాక్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఇక ఈ మొబైల్ బ్లాక్ బెర్రీ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ పవర్ పుల్ 1.2 GHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి 768 MB RAMతో రన్ అవుతుంది. బ్లాక్ బెర్రీ బోల్డ్ టచ్ 9900 ఇంటర్నల్‌గా 8జిబి మొమొరీని స్టోర్ చేసుకుంటుండగా, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా ఎక్సాండబుల్ మొమొరీని కూడా వేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి పవర్ పుల్ కెమెరా హై డెఫినేషన్ క్వాలిటీతో పాటు, 720p HD వీడియో రికార్డింగ్ ఫార్మెట్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ మొదలగువాటిని సపోర్ట్ చేస్తుంది. 2జీ ఇంటర్నెట్ టెక్నాలజీలైన GPRS, EDGEలతో పాటు 14Mbps స్పీడ్‌తో 3జీ నెట్ వర్క్స్‌కి డేటా ట్రాన్ఫర్‌ని అందిస్తుంది.

The notable BlackBerry Bold Touch 9900 features:

1.2 GHz processor with 768 MB RAM
5.0 Mega Pixel Camera with 720p video recording
8 GB internal storage with up to 32 GB external expansion capability
3G, GPRS, EDGE
Bluetooth and Wi-Fi
Good Battery Backup

ఇక బ్లాక్ బెర్రీ బోల్డ్ టచ్ 9900 ఖరీదు ఇంకా ఇండియన్ మొబైల్ మార్కెట్లో నిర్ణయించలేదు. ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి సుమారుగా డిసెంబర్ 2011లో విడుదల అవుతుందని నిపుణుల అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot