ఊదరగొట్టి ఉసూరుమనిపించింది...?

Posted By: Prashanth

ఊదరగొట్టి ఉసూరుమనిపించింది...?

 

స్మార్ట్ ఫోన్ తయారీ పరిశ్రమలో మన్నికైన ఉత్పాదక సంస్థగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ‘బ్లాక్‌బెర్రీ’ తాజాగా తీసుకున్న నిర్ణయం అభిమానులను కలవరానికి గురి చేసినట్లు తెలుస్తోంది. ఈ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ ఇటీవల ప్రత్యేక లక్షణాలతో కూడిన ‘మిలాన్’(Milan) స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెడతున్నట్లు ప్రకటనలు గుప్పించింది. అయితే అనుకోని విధంగా హార్డ్‌వేర్ సంబంధిత సమస్యలు తెలెత్తటంతో ‘రిమ్’(RIM) మిలాన్ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను ఉపసంహరిచుకునే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ అంశానికి సంబంధించి ‘బ్లాక్‌బెర్రీ’ వర్గాల నుంచి అధికారికంగా ఏ విధమైన ప్రకటన లేదు. అయితే రిమ్ ఇంజనీర్‌లు తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు నిర్విరామంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ‘మిలాన్’ స్మార్ట్ ఫోన్‌ను ఈ ఏడాది మూడవ త్రైమాసింకంలో విడుదల చేయ్యాల్సి ఉంది. LTE ఆధారిత చిప్‌సెట్స్ కోసం కంపెనీ ఎదరు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బ్లాక్‌బెర్రీ మిలాన్‌కు ప్రత్యామ్నాయంగా మరో మన్నికైన డివైజ్‌ను రూపొందించే ప్లాన్‌లో రిమ్ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting