ఆండ్రాయిడ్, ఐవోఎస్ కలయికే బ్లాక్ బెర్రీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'బిబిఎక్స్'

Posted By: Staff

ఆండ్రాయిడ్, ఐవోఎస్ కలయికే బ్లాక్ బెర్రీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'బిబిఎక్స్'

బ్లాక్‌బెర్రీ మొబైల్ తయారీదారు రీసెర్చ్ ఇన్ మోషన్ కొత్తగా మార్కెట్లోకి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ పేరు 'బిబిఎక్స్'. ఈ విషయాన్ని రీసెర్చ్ ఇన్ మోషల్ కో-ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ గతంలో బ్లాక్‌బెర్రీ విడుదల చేసిన క్యూఎన్‌ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి కొత్తహాంగులు చేర్చి అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

ఇక బ్లాక్‌బెర్రీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'బిబిఎక్స్', బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సమానమైన ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా గూగుల్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండింటి కలయికే ఈ బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటున్నారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే యాపిల్ మాక్ ఓఎస్ ఎక్స్ నుండి బిబిఎక్స్ కూడా వచ్చిందని కొంత నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అందించే ఈ మెయిల్ ఫీచర్‌ని లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ బిబిఎక్స్‌లో మరింత సులభతరం చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ పనులను ఏవిధంగానైతే క్యూఎన్‌ఎక్స్‌లో ఈజీగా చేశారో అంతే ఈజీగా ఇందులో కూడా చేయవచ్చని తెలిపారు. వీటితో పాటు మీడియా ఫీచర్స్, టచ్ ఫెసిలిటీస్ విషయంలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతానికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అధికారిక ప్రకటన బ్లాక్‌బెర్రీ విడుదల చేయలేదు. బ్లాక్‌బెర్రీ అధికారికంగా విడుదల చేసిన మరింత సమాచారం వన్ ఇండియా పాఠకుల కొసం ప్రత్యేకంగా అందజేయడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే భారత్‌తోపాటు, విదేశాల్లోనూ రెండో రోజు కూడా బ్లాక్‌బెర్రి సేవలకు విఘాతం కలిగింది. ఐరోపా, పశ్చిమాసియా, ఆఫ్రికా, భారత్, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా దేశాల్లో బ్లాక్‌బెర్రి యూజర్లకు ఈ మెయిల్ యాక్సెస్ చేయడం, మెసెంజర్, ఇతర ఆన్‌లైన్ సర్వీసుల విషయంలో ఇబ్బందులు తలెత్తాయని బ్లాక్‌బెర్రిలు తయారు చేసే రీసెర్చ్ ఇన్ మోషన్(ఆర్‌ఐఎం) తెలిపింది.

వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని, ఇబ్బందులు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్, ట్విట్టర్‌లో ఒక మెసేజ్‌ని కంపెనీ పోస్ట్ చేసింది. భారత్‌లో పది లక్షలమందిదాకా బ్లాక్‌బెర్రి వినియోగదారులు ఉన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot