ఇక నుండి బ్లాక్‌బెర్రీ లోకేషన్ ఆధారిత సేవలు..

Posted By: Staff

ఇక నుండి బ్లాక్‌బెర్రీ లోకేషన్ ఆధారిత సేవలు..

సాధారణంగా మార్కెట్లోకి విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్స్‌ 'హై స్పీడ్ వై-పై' 3జీని సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకోని బ్లాక్ బెర్రీ మొబైల్ తయారీదారు రిసెర్చ్ ఇన్ మోషన్ మార్కెట్లోకి కొత్త స్ట్రాటజీతో అడుగుపెడుతుంది. ఈ కొత్త స్ట్రాటజీ వల్ల ఉపయోగం ఏమిటంటే బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా లోకేషన్ ఆధారిత సర్వీస్‌లను అందించనున్నాయి. జిపిఎస్‌తో కాకుండా వై-పై నెట్ వర్క్ ద్వారా బ్లాక్ బెర్రీ మొబైల్ ఫోన్స్ ఈ లోకేషన్ ఆధారిత సర్వీస్‌ని అందించడమే ఇక్కడి ప్రత్యేకత.

ఈ సందర్బంలో రీసెర్చ్ ఇన్ మోషన్ ప్రతినిధులు మాట్లాడుతూ సాధారణంగా అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్‌లలో వై-పై ఉన్నప్పటికీ ఆ ఫీచర్‌ని మేము ఉపయోగించుకునే విధంగా ఏ మొబైల్ తయారీదారు కూడా ఉపయోగించడం లేదని పేర్కోన్నారు. ఈ కొత్త టెక్నాలజీ సహాయంతో బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్స్ అవుతాయి. వై-పై నెట్ వర్క్ ద్వారా బ్లాక్ బెర్రీ లోకేషన్‌కి సంబంధించిన సమాచారం అంతా షేర్ చేయడం జరుగుతుంది. జనరల్ హ్యాండ్ సెట్స్‌లలో లోకేషన్స్‌ని జిపిఎస్ ద్వారా అనుసంధానం చేయడం జరుగుతుంది.

బ్లాక్ బెర్రీ మొబైల్స్ మాత్రం సైట్ లోకేషన్ ట్రాకింగ్, జిపిఎస్ ఫెసిలిటీని ఎక్కువ కాలం యూజర్స్‌కు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొవడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ఉన్న WiFi network’s ‘geo-location’ ఫీచర్ సహాయంతో లోకేషన్ ఆధారిత సర్వీస్‌ని ఫాస్ట్‌గా అందించవచ్చు. సాధారణంగా జిపిఎస్ సర్వీస్ ఉన్న స్మార్ట్ ఫోన్‌లో లోకేషన్‌ని ఫిక్స్ చేసేందుకు గాను 30 సెకన్స్ తీసుకోగా, బ్లాక్ బెర్రీ మొబైల్స్‌లో మాత్రం ఇంకా ఫాస్ట్‌గా ఫిక్స్ చేస్తుంది. అంతేకాకుండా ఈ జిపిఎస్ లోకేటర్ ద్వారా వెళితే బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఖర్చు అవుతుంది.

రీసెర్చ్ ఇన్ మోషన్ అందించేటటువంటి బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇప్పటికే ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయనున్న 'బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ 6'ని అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(API) పేరుతో విడుదల చేయనుంది. దీంతో కొన్ని లోకేషన్ ఆధారిత సర్వీసులు మాత్రమే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, ఫోర్ స్కైర్ లను యాక్సెస్ చేయగలుగుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot