బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ పై ఆకర్షణీయమైన ధర తగ్గింపు

Posted By:

కెనడాకు చెందిన ప్రముఖ క్వీర్టీ కీప్యాడ్ ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ గత జూన్‌లో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన క్యూ 10 రకం స్మార్ట్‌ఫోన్ పై 13శాతం ధర రాయితీని ప్రకటించింది. దీంతో బ్లాక్బెర్రీ క్యూ10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ జనవరి 26 వరకు అమలులో ఉంటుందని బ్లాక్‌బెర్రీ ఇండియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ పై ఆకర్షణీయమైన ధర తగ్గింపు

ఇప్పటి వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో రూ.42,000 నుంచి రూ.44,000 ధరల మధ్య విక్రయిస్తున్నారు. ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లను అమితంగా ఇష్టపడే భారతీయులను ఈ ఆఫర్ మరింతగా ఆకర్షిస్తుందని బ్లాక్‌బెర్రీ ఇండియా ఎండీ సునీల్ లాల్వానీ తెలిపారు.

బ్లాక్‌బెర్రీ క్యూ 10 కీలక స్పెసిఫికేషన్‌లు:

సరికొత్త బీబీ10 ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే 3 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, క్వర్టీ కీబోర్డ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, 4జీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot