లవ్ బాస్కెట్లో బ్లాక్‌బెర్రీ

Posted By: Staff

లవ్ బాస్కెట్లో బ్లాక్‌బెర్రీ

బ్లాక్‌బెర్రీ మొబైల్ తయారీదారు రీసెర్చ్ ఇన్ మోషన్ మొబైల్ మార్కెట్లోకి త్వరలో అందమైన బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్ 'బ్లాక్‌బెర్రీ 9980'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 'బ్లాక్‌బెర్రీ 9980' మొబైల్ క్వర్టీ కీప్యాడ్‌తో చూపరుల మనసుని ఆకర్షించే విధంగా రూపొందించడం జరుగుతుంది. ఇక దీని ప్రత్యేకతలుగా కెమెరా, ప్లాష్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ మొబైల్ నిపుణులు వారియొక్క బ్లాగులలో వెల్లడించడం జరిగింది.

బ్లాక్‌బెర్రీ 9980 స్మార్ట్ పోన్ బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని సమాచారం. మెటాలిక్‌తో దీనియొక్క క్వర్టీ కీప్యాడ్‌ని రూపొందించడంతో చూసేందుకు స్మార్ట్ ఫోన్ చాలా అందంగా ఉంది. నాలుగు బ్లాక్‌బెర్రీ బటన్స్ మద్యనున్న టచ్ పాడ్ అద్బుతం. ప్రస్తుతం ప్రక్క ఫోటోలో ఉన్న ఇమేజిను గనుక చూసినట్లేతే చైనా మొబైల్ ఎడ్జి నెట్‌వర్క్‌తో రన్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. దీని ధర సుమారుగా రూ 55,000 వరకు ఉండవచ్చునని అంచనా..

యూజర్స్ కొసం ప్రత్యేకంగా తయారు చేసిన 2.8 ఇంచ్ టచ్ స్క్రీన్, మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతం చేసేందుకు గాను ఇందులో 1.2GHz క్వాలికామ్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు 4x డిజిటల్ జూమ్ దీని ప్రత్యేకం. 8GB RAMని మొబైల్‌లో నిక్షిప్తం చేయడం జరిగిందని సమాచారం. ప్రస్తుతానికి ఇంటర్నెట్లో లీక్ అయిన సమాచారం ప్రకారం పైన పేర్కోన్న ఫీచర్స్‌ని పాఠకులకు తెలియజేయడం జరుగుతుంది.

బ్లాక్‌బెర్రీ 9980 స్మార్ట్ ఫోన్‌‌కి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ త్వరలో మరో ఆర్టికల్ రూపంలో అందివ్వడం జరుగుతుంది. అప్పటి వరకు వన్ ఇండియా మొబైల్‌ న్యూస్‌కి టచ్‌లో ఉండండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot