బ్లాక్‌బెర్రీ క్యూ5 స్మార్ట్‌ఫోన్ పై రూ.5000 తగ్గింపు

బ్లాక్‌బెర్రీ అభిమానులకు శుభవార్త... పండుగ సీజన్‌ను పురస్కరించుకుని బ్లాక్‌బెర్రీ ఇండియా తన ‘క్యూ5 స్మార్ట్‌ఫోన్'పై ఏకంగా 20 శాతం ధర తగ్గింపును ప్రకటించింది. బ్లాక్‌బెర్రీ ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం బీబీ10 పై స్పందించే ‘క్యూ 5' స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.24,990. తాజా, ఆఫర్‌లో భాగంగా ఫోన్‌ను రూ.5,000 తగ్గింపుతో 19,990కే సొంతం చేసుకునే అవకాశాన్ని కెనడియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ కల్పిస్తోంది.
ఇటీవల కాలంలో బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సామ్‌సంగ్, యాపిల్ వంటి కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. తాజాగా ప్రవేశపెట్టిన ఆఫర్ బ్లాక్‌బెర్రీ క్యూ5 స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాల పై ఏ మేరకు ప్రభావం చూపనుందో వేచిచూడాలి.
బ్లాక్‌బెర్రీ క్యూ 5 స్పెసిఫికేషన్‌లు:
3.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 720పిక్సల్స్), బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, క్వర్టీ కీబోర్డ్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2180 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








