దారి చూపే 'మొబైల్స్', నీ మేలు ఎన్నడూ మరువం...

By Super
|
Blackberry Torch 9810 and 9860
రీసెర్చ్ ఇన్ మోషన్ తయారు చేసేటటువంటి బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌కి మార్కెట్లోకి మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని బ్లాక్ బెర్రీ కొత్తగా మార్కెట్లోకి రెండు కొత్త 4జీ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తుంది. ఈ రెండు స్మార్ట్ పోన్స్‌ని కూడా అమెరికాలో మొదట టి-మొబైల్, ఏటి అండ్ టి భాగస్వామ్యంతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. బ్లాక్ బెర్రీ విడుదల చేయనున్న ఈ రెండు మొబైల్స్ కూడా బ్లాక్ బెర్రీ టార్చ్ సిరిస్‌కు సంబంధించినవి.

బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810 మొబైల్ ప్రత్యేకతలు:

బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810 క్వర్టీ కీప్యాడ్‌తో ఆకర్షణీయంగా రూపోందించడం జరిగింది. బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810 మొబైల్‌తో పాటు 8జిబి మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఇందులో 768 MBని నిక్షిప్తం చేయడం జరిగింది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 5మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. కెమెరాతో పాటు డ్యూయల్ ఎల్‌ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్ అదనం.

వీటితో పాటు బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810 మొబైల్‌లో జియో ట్యాగింగ్‌తో పాటు కంటిన్యూస్ ఆటో ఫోకస్ ఉండడం వల్ల చక్కని వీడియో క్యాప్చరింగ్‌కి దోహాదపడుతుంది. వీటితో పాటు మార్కెలో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810 మొబైల్‌ ధర మార్కెట్లో సుమారుగా రూ 29,749గా నిర్ణయించడం జరిగింది. మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810 మొబైల్‌ని నవంబర్ 9వ తారీఖున టి-మొబైల్ ద్వారా మార్కెట్లోకి ఆవిష్కరించనున్నారు.‌

బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 మొబైల్‌ ప్రత్యేకతలు:

బ్లాక్‌బెర్రీ పేరంట్ కంపెనీ అయిన కెనడియన్ రీసెర్చ్ ఇన్ మోషన్ సంస్ద బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 స్మార్ట్ ఫోన్‌ విడుదల చేసింది. దీని ధర రూ.28,490 కాగా కొత్త బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పనిచేస్తుంది. బ్లాక్‌బెర్రీ టార్చ్‌ 9860కు అదనపు ఆకర్షణలు ఆలా ఉన్నాయి. 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా బ్రౌజింగ్‌ స్పీడ్‌గా ఉంటుందని రిమ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫెర్నెబావాచెప్పారు.

బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 మొబైల్ ఫెర్పామెన్స్ స్పీడ్‌గా ఉండేందుకు గాను 1 జీహెచ్‌జీ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తోపాటు 3.7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ద్వారా వెబ్‌పేజీలు, ఫోటోలు, వీడియో లతో పాటు పవర్‌ఫుల్‌ గేమింగ్‌ ఫీచర్స్ యూజర్స్ కొసం ప్రత్యేకంగా రూపోందించడం జరిగింది. కమ్యూ నికేషన్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు వీడి యో రికార్డింగ్‌ కూడా అనుకూలంగా ఉంటుంది.

బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 మొబైల్ వెనుక భాగాన 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు హై డెఫినేషన్ వీడియోని 720p ఫార్మెట్లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయినటువంటి బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ తో పాటు , 2జీ ఇంటర్నెట్ టెక్నాలజీలైన GPRS, EDGEలను కూడా సపోర్ట్ చేస్తుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 మొబైల్ జిఎస్‌ఎమ్ సిమ్ కోసం తయారు చేయడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో ధీని ధర సుమారుగా రూ 30,000 వరకు ఉండవచ్చునని అంచనా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X