ఒకే విధమైన ఫీచర్స్ కలిగిన బ్లాక్‌బెర్రీ టార్చ్.. రేటులోనే తేడా

Posted By: Staff

ఒకే విధమైన ఫీచర్స్ కలిగిన బ్లాక్‌బెర్రీ టార్చ్.. రేటులోనే తేడా

మొబైల్ తయారీ రంగంలో బ్లాక్‌బెర్రీ పేరు వినని వారు ఉండరంటే నమ్మండి. ఇక బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌ని తయారు చేస్తున్నటువంటి సంస్ద రీసెర్చ్ ఇన్ మోషన్. ఇటీవల కాలంలో రెండు స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ రెండు మొబైల్స్ ఒకటి బ్లాక్‌బెర్రీ టార్చ్ 9850, మరోకటి బ్లాక్‌బెర్రీ 9860. ఈ రెండు మొబైల్స్‌ని కూడా ప్రస్తుతం యూత్‌ని దృష్టిలో పెట్టుకోని రూపోందించడం జరిగింది.

రెండు మొబైల్స్‌లో ఉన్న తేడాని గనుక గమనించినట్లైతే మనకు తప్పనిసరిగా ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే రెండు మోడల్స్ కూడా చూడడానకి ఒకే విధంగా ఉండడమే. రెండు మొబైల్స్ కూడా గతంలో బ్లాక్‌బెర్రీ కంపెనీ నుండి వచ్చినటువంటి ట్రెడిషనల్ బ్లాక్‌బెర్రీ మొబైల్ మాదరే ఉంటాయి. మొదట చూపులోనే చూడగానే ఇట్టే ఆకట్టుకునే అమ్మాయి లాగా బ్లాక్‌బెర్రీ 9680 అద్బుతమైనటువంటి 15:9 శాతంతో రూపోందించబడింది. ఇక స్క్రీన్ డిస్ ప్లే సైజు విషయానికి వస్తే 3.7 ఇంచ్ ఉండడంతో యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలిగిస్తుంది. దీనితో పాటు 11.5 mm పోడవైన స్లిమ్ డిజైన్ 9860నా లేక 9850 అనే విధంగా ఉంటుంది.

రెండు బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్స్ మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 4GB మొమొరీని అందిస్తుండగా, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు ఎక్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రెండు మొబైల్స్‌లలో 1.2GHz ప్రాసెసర్ ఉండడం వల్ల ఆన్ లైన్, మల్టీ టాస్కింగ్ పనులు చాలా వేగవంతంగా చేస్తాయి. మల్టీమీడియా, గేమింగ్ అప్లికేషన్స్ ఫాస్ట్‌గా రన్ అవ్వడానికి ఇందులో ఉండే లిక్విడ్ గ్రాఫిక్స్ పని చేస్తాయి. బ్లాక్‌బెర్రీ కంపెనీ నుండి వచ్చేటటువంటి అప్లికేషన్స్ వికిటుడి వరల్డ్ బ్రౌజర్, అమెజాన్ ఎమ్‌పి 3 మొదలగునవి అందుబాటులో ఉంటాయి. వేరే బ్లాక్‌బెర్రీ మొబైల్స్ నుండి వచ్చేటటువంటి BBM6 మెసేజ్‌లను అర్దమయ్యే రీతిలో అందిస్తాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి హై డెఫినేషన్ వీడియోలు, ఫ్రోఫెషనల్ ఇమేజి ఎడిటింగ్ లాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లోకి రెండింటినీ బ్లాక్‌బెర్రీ టార్చ్ సిరిస్‌తో విడుదల చేయడం జరిగింది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలు అయినటువంటి బ్లూటూత్, వై-పై లాంటి వాటిని కూడా సపోర్ట్ చేస్తాయి. త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లో దర్శనమివ్వనున్న రెండు మొబైల్స్ ధర ప్రస్తుతానికి బ్లాక్‌బెర్రీ విడుదల చేయనప్పటికీ నిపుణుల అంచనా ప్రకారం సుమారుగా రూ 28,099 - 35,000 వరకు ఉండవచ్చునని అంచనా.

ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌లో టెక్నాలజీ బ్లాగు నిపుణులు ప్రకారం ఇండియాలో బ్లాక్‌బెర్రీ టార్చ్ 9850 ధర సుమారుగా రూ 24,000గా, అదే బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 ధర మాత్రం రూ 26, 000గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot