బ్లాక్‌బెర్రీ 7 ఓఎస్‌కి కాలం చెల్లిందా..?

Posted By: Super

బ్లాక్‌బెర్రీ 7 ఓఎస్‌కి కాలం చెల్లిందా..?

 

బ్లాక్‌బెర్రీ తయారీదారైన రీసెర్చ్ ఇన్ మోషన్ మార్కెట్లోకి ఉత్తమమైన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో యాపిల్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ నుండి పోటీని తట్టుకునేందుకు గాను బ్లాక్‌బెర్రీ 9900/9930 మొబైల్ ఫోన్స్‌తో పాటు టాబ్లెట్స్ అన్నింటిలో కూడా బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ని నిక్షిప్తం చేసిన విషయం తెలిసిందే. బ్లాక్‌బెర్రీ విడుదల చేసిన కొన్ని మొబైల్స్‌లలో వీడియో కాలింగ్ ఫీచర్ కోసం ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ - కోర్ ప్రాసెసర్స్, యూట్యూబ్ లాంటి లేకపోవడం వల్ల స్మార్ట్ ఫోన్ విభాగంలో బ్లాక్‌బెర్రీ వెనుక భాగాన ఉండాల్సి వస్తుందని మొబైల్ నిపుణుల అంచనా.

2012 కొత్త సంవత్సరం వస్తున్న సందర్బంలో రీసెర్చ్ ఇన్ మోషన్ ఏయే ఉత్పత్తులను విడుదల చేయనుందో దానికి సంబంధించిన వివరాలను పాఠకులకు తెలయజేయడం జరుగుతుంది. బ్లాక్‌బెర్రీ టాబ్లెట్స్ కోసం గతంలో ఉపయోగిస్తున్న క్యూఎన్‌ఎక్స్ సాప్ట్‌వేర్ స్దానంలో బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ టాబ్లెట్‌లలో బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేయనుంది.

ఇక బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొట్టమొదటి బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్‌ని మార్చి 13వ తారీఖున అధికారకంగా బ్లాక్‌బెర్రీ విడుదల చేయనుంది. బ్లాక్ బెర్రీ అధికారకంగా ఫోన్ గురించిన సమాచారం విడుదల చేయనప్పటికీ ఈ మొబైల్ పేరు 'బ్లాక్‌బెర్రీ లండన్' అని తెలిసింది. ఇది మాత్రమే కాకుండా బ్లాక్‌బెర్రీ లండన్‌కు చెందిన జిఎస్‌ఎమ్ వర్సన్‌ని కూడా మార్కెట్లోకి విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిఎస్‌ఎమ్ వర్సన్‌తో విడుదలయ్యేటటువంటి ఈ ఫోన్‌ని 'వెరిజోన్' ప్రమోట్ చేయనుంది. దీని పేరు 'బ్లాక్‌బెర్రీ మిలన్'.

వీటితో పాటు 'బ్లాక్‌బెర్రీ నెవడా' ప్రస్తుతం మొబైల్స్ విభాగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ మొబైల్ కూడా బ్లాక్‌బెర్రీ బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. పుల్ క్వర్టీ కీ ప్యాడ్‌తో మార్కెట్లోకి వస్తున్న ఈ మొబైల్‌పై కస్టమర్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక టాబ్లెట్ మార్కెట్ విషయానికి వస్తే అత్యాధునిక, సాంకేతిక ఫీచర్స్‌తో 'బ్లాక్‌బెర్రీ బ్లాక్ ఫారెస్ట్' వచ్చే సంవత్సరం మార్కెట్లోకి రానున్న టాబ్లెట్. గతంలో వచ్చిన టాబ్లెట్స్‌తో పోల్చితే గనుక 10 ఇంచ్‌లు స్క్రీన్ డిస్ ప్లేతో పాటు సుపిరీయర్ రిజల్యూషన్‌ని అందిస్తుందని అంటున్నారు.

బ్లాక్‌బెర్రీ ప్రతినిధులు వెల్లడించిన సమాచారం ప్రకారం రాబోయే కాలంలో బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉత్పత్తులు కనుమరగవనున్నాయని అన్నారు. బ్లాక్‌బెర్రీ కొత్తగా రూపొందించిన బిబిఎక్స్ ఆపరేటింగ్ ఫీచర్స్ గొప్పగా ఉండడమే అందుకు కారణం అని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot