బ్లాక్‌బెర్రీ తాజా అప్‌డేట్!

Posted By: Staff

 బ్లాక్‌బెర్రీ తాజా అప్‌డేట్!

 

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన తాజా సమాచారం వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ వెబ్ పోర్టల్ ఫోన్ యరీనా సంబంధిత వివరాలను పేర్కొంటూ ఓ శీర్షికను ప్రచురించింది. రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) బ్లాక్‌బెర్రీ ఫోన్‌లకు రూపకల్పన చేస్తున్న విషయం తెలిసింది. సదరు సైట్ ద్వారా సేకరించిన వివరాల మేరకు బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10’ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.

హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు (2012)

- బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,

- 3జీ ఫోన్,

- 1.5గిగాహెట్జ్ టీఐ వోఎమ్ఏపి 4470 ప్రాసెసర్,

- 4.2 అంగుళాల స్ర్కీన్,

- 2జీబి ర్యామ్,

- 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

- స్వాపబుల్ మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

- 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్),

- 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

- 1800ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

మరో స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ ‘ఎక్స్10’ చిత్రాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ టచ్‌ప్లస్ క్వర్టీ డిజైన్‌ను కలిగి ఉండటం విశేషం. ఇతర స్పెసిఫికేషన్‌లకు సంబంధించి అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది. గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న రిమ్ జనవరి 30న బీబీ10 వోఎస్‌ను ఆవిష్కరించి తిరిగి పుంజుకోవాలనుకుంటోంది. బీబీ10 వోఎస్ 75,000పై చిలుకు అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది.

బెస్ట్ ల్యాప్‌టాప్స్ (2012)!

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot