మీడియాకు చిక్కిన బ్లాక్‌బెర్రీ బీబీ10 స్మార్ట్‌ఫోన్?

Posted By: Prashanth

మీడియాకు చిక్కిన బ్లాక్‌బెర్రీ బీబీ10 స్మార్ట్‌ఫోన్?

 

బ్లాక్‌బెర్రీ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘బీబీ10’ విడుదలకు సమయం సమీపిస్తున్న నేపధ్యంలో  ఈ వోఎస్ ఆధారితంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ పై  అనేక రూమర్లు వ్యక్తమవుతున్నాయి. రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) అధికారికంగా ప్రకటించిన  వివరాల మేరకు బీబీ10 వోఎస్‌ను జనవరి 30న ఆవిష్కరించనున్నారు. బీబీ10 ఫ్లాట్‌ఫామ్ పై స్పందించే తొలి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనేక గుసగుసలు వినిపిస్తున్న నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్  ‘అన్‌వైరిడ్ వ్యూ’ బ్లాక్‌బెర్రీ 10 ఎల్-సిరీస్‌కు చెందిన ‘బ్లాక్‌బెర్రీ జడ్ 10’ హ్యాండ్‌సెట్ వివరాలను బహిర్గతం చేసింది.

బ్లాక్‌బెర్రీ భవిష్యత్ మోడల్స్ (ఫోటో గ్యాలరీ)!

ఈ పోర్టల్ విడుదల చేసిన ప్రెస్‌షాట్‌లో ‘బ్లాక్‌బెర్రీ జడ్ 10’ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లతో కూడిన ఫోటోగ్రాఫ్ దర్శనమిచ్చింది. బ్లాక్‌బెర్రీ మునుపటి వర్షన్ వోఎ‌స్‌లతో పోలిస్తే బీబీ10 వివిధ విభాగాలకు చెందిన అప్లికేషన్‌లను యూజర్‌లకు అందించనుంది. గత నివేదికల ద్వారా సేకరించిన వివరాలు మేరకు ఎల్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు..?

4.3 అంగుళాల డిస్‌ప్లే,

రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,

డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి  పొడిగించుకునే సౌలభ్యత,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వై-ఫై 802.11 బి/జి/ఎన్,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ).

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot