బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు హిట్టా.. ఫట్టా?

Posted By:

బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) బుధవారం తన కొత్తవర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘బ్లాక్‌బెర్రీ10'తో పాటు జెడ్10, క్యూ10 మోడళ్లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి గత కొంత కాలంగా అనేక రూమర్లు హల్‌చల్ చేస్తూ వచ్చాయి. అయితే ఈ పుకార్లకు బుధవారంతో తెరపడింది.

బీబీ10 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన సమాచారాన్నిఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్‌లతో మీకు చేరువుచేస్తూ వచ్చిన గిజ్‌బాట్ ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లలోని మంచి, చెడు లక్షణాలను వెతికే ప్రయత్నం చేసింది. ఆ వివరాలను క్రింది గ్యాలరీలో చూడొచ్చు...

కెనాడాకు చెందిన ప్రముఖ బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) బుధవారం ‘బ్లాక్‌బెర్రీ 10' (బీబీ10) ఆపరేటింగ్ సిస్టంను ప్రత్యేక వేదిక పై ఆవిష్కరించింది. ఈ వోఎస్ ఆధారంగా పనిచేసే రెండు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను (జెడ్10, క్యూ10) బ్లాక్‌బెర్రీ ఈ సందర్భంగా పరిచయం చేసింది. అంతేకాకుండా, తమ కంపెనీ పేరును కూడా బ్లాక్‌బెర్రీగా మార్చేసినట్లు సంస్థ సీఈవో థార్సటన్ హెయిన్స్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు హిట్టా.. ఫట్టా?

డిస్‌ప్లే ఇంకా బరువు - అంతగా ఆకట్టుకోలేదు:

బ్లాక్‌బెర్రీ జడ్10, 4.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 768పిక్సల్స్. మరోవైపు బ్లాక్‌బెర్రీ క్యూ10 3.1 అంగుళాల డిస్‌ప్లేతో క్వర్టీకీబోర్డ్‌ను కలిగి ఉంటుంది. ఇక బరువు విషయానికొస్తే జడ్10 మోడల్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో మోడల్ క్యూ10 139 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

ఈ రెండు ఫోన్‌ల డిస్‌ప్లేలు ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ పెద్ద‌స్ర్కీన్ (5 అంగుళాల) ఫోన్‌లతో పోలిస్తే చిన్నవిగా ఉన్నాయి. బిజినెస్ ఇంకా మీడియా అవసరాలను మన్నికతో తీర్చటంలో బ్లాక్‌బెర్రీ డిస్‌ప్లేలు విఫలమయ్యే అవకాశం లేకపోలేదు.

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు హిట్టా.. ఫట్టా?

ప్రాసెసర్ - వెనుకబడి ఉంది:

ఈ రెండు హ్యాండ్‌సెట్‌లలో 1.5గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన టీఐ వోఎమ్ఏపి 4470 డ్యూయల్ - కోర్ ప్రాసెసర్‌లను వినియోగించారు. అయితే ఇవి క్వాడ్ చిప్‌లతో పోలిస్తే వెనుకబడి ఉన్నాయి. మార్కెట్లో ఇప్పటికే క్వాడ్‌కోర్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను పలు బ్రాండ్‌లు ఆవిష్కరించాయి. వీటి నుంచి బ్లాక్‌బెర్రీ పోటీని ఎదుర్కొవల్సి ఉంటుంది.

 

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు హిట్టా.. ఫట్టా?

ఆపరేటింగ్ సిస్టం - అదిరింది:

ఈ రెండు ఫోన్‌లలో వినియోగించిన బ్లాక్‌బెర్రీ 10 ప్లాట్‌ఫామ్ ఆధునిక ఫీచర్లను కలిగి భేష్ అనిపిస్తోంది. ముఖ్యంగా బీబీఎమ్ విత్ పీక్, బ్లాక్‌బెర్రీ హబ్, ప్రిడిక్టివ్ టైపింగ్ టూల్, డ్రాప్‌బాక్స్, డాక్స్ టూ గో వంటి ప్రత్యేక అప్లికేషన్‌లు మొబైల్ కంప్యూటింగ్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీ చేస్తాయి.

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు హిట్టా.. ఫట్టా?

కెమెరా ఫీచర్ -కెవ్వు కేక:

బ్లాక్‌బెర్రీ జడ్10 ఇంకా క్యూ10లు పలు ఆండ్రాయిడ్ ఫోన్‌ల తరహాలో 8 మెగా పిక్సల్ రేర్ ఇంకా 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థలను కలిగి ఉన్నాయి. అయితే ఈ ఫ్రంట్ కెమెరాలు 3ఎక్స్ డిజిటల్ జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. రేర్ కెమెరాలు ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, 5ఎక్స్ డిజిటల్ జూమ్, జీయో ట్యాగింగ్, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ వంటి క్వాలిటీ కెమెరా స్పెసికేషన్‌లను కలిగి ఉత్తమ స్థాయి ఫోటోగ్రఫీని అందిస్తాయి.

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు హిట్టా.. ఫట్టా?

నిరాశ కలిగించే స్టోరేజ్:

బ్లాక్‌బెర్రీ జడ్10 ఇంకా క్యూ10లు, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా 2జీబి ర్యామ్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఇది నిరుత్సాహ పరిచే అంశమే. సామ్‌సంగ్, యాపిల్, హెచ్‌టీసీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు తమ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను 16జీబి అంతకన్నాఎక్కువ స్టోరేజ్ వేరియంట్‌లలో ఆఫర్ చేస్తున్నాయి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సాయంతో మెమరీని 32జీబికి పొడిగించుకునే అవకాశాన్ని కల్పించటం కాస్త ఊరటనిచ్చే అంశం.

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు హిట్టా.. ఫట్టా?

కనెక్టువిటీ ఫీచర్లు అదుర్స్:

కనెక్టువిటీ విషయంలో ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు మంచి మార్కులను కొట్టేసాయి. ఈ ఫోన్‌లలోని కనెక్టువిటీ ఫీచర్లు యాపిల్ డివైజ్‌లకు పోటీనిచ్చేవిగా ఉండటం విశేషం. మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేన్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ ఫీచర్లను బ్లాక్‌బెర్రీ జడ్10 ఇంకా క్యూ10 హ్యాండ్‌సెట్‌లలో పొందుపరిచారు.

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు హిట్టా.. ఫట్టా?

బ్యాటరీ సూపర్:

ఈ ఫోన్‌లలో వినియోగించిన 1800ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీలు మన్నికైన బ్యాకప్‌ను అందిస్తాయి. అయితే మరిన్ని విశ్లేషణలు వెల్లడికావల్సి ఉంది.

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు హిట్టా.. ఫట్టా?

మంచి ఉపకరణాలు:

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి బ్లాక్‌బెర్రీ.. మినీ స్టీరియో స్సీకర్, ఆన్-ద-గో ఛార్జింగ్ వంటి ప్రత్యేక ఉపకరణాలను విడుదల చేసింది. అయితే ఇవి ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే లభ్యం కానున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot