బ్లాక్‌బెర్రీ vs నోకియా

|

ఉత్కంఠకు తెరపడింది. ఎన్నో ఎదురుచూపుల మధ్య బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం విడుదలయ్యంది. తమ పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకునే క్రమంలో బ్లాక్‌బెర్రీ విడుదల చేసిన రెండు బీబీ10 స్మార్ట్‌పోన్‌లు ‘జడ్10', ‘క్యూ10'లపై టెక్ మార్కెట్లో వాడివేడి విశ్లేషణలు జరుగుతున్నాయి. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్ ఆండ్రాయిడ్, యీపిల్ ఐవోఎస్‌లు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతన్న విషయం తెలిసిందే.

 

విండోస్ ఫోన్8 మూడవ స్థానంలో కొనసాగుతోంది. తాజగా విడుదలైన బ్లాక్‌బెర్రీ10 ఈ మూడు వోఎస్‌లకు ఏవిధమైన పోటినిస్తుందనే అంశం పై భిన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావంతో విండోస్ ఫోన్ 8, బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టంల మధ్య పోటీ రసవత్త్రం కానుంది.

 

నేటి ప్రత్యేక కధనంలో భాగంగా విండోస్ ఫోన్ 8, బ్లాక్‌బెర్రీ 10 వోఎస్‌ల పై స్పందించే లూమియా 920, బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిపికేషన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం.

BlackBerry Z10 vs Nokia Lumia 920

బరువు ఇంకా చుట్టుకొలత.......
లూమియా 920: ఫోన్ చుట్టుకొలత 130.3 x 70.8 x 10.7మిల్లీ మీటర్లు, బరువు 185 గ్రాములు,
బ్లాక్‌బెర్రీ జడ్10: చుట్టుకొలత 130 x 65.6 x 9మిల్లీ మీటర్లు, బరువు 135 గ్రాములు,

డిస్‌ప్లే.....
లూమియా 920: 4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినషన్+ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,
బ్లాక్‌బెర్రీ జడ్10: 4.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,

ప్రాసెసర్.....
లూమియా 920: డ్యూయల్ కోర్ 1.5గిగాహట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
బ్లాక్‌బెర్రీ జడ్10:డ్యూయల్ కోర్ 1.5గిగాహట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం...
లూమియా 920: విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేక ఫీచర్లు: డైనమిక్ లైవ్‌టైల్ సమాచారం, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్ సింక్రనైజేషన్, ఫేస్‌బుక్-ఈవెంట్స్, ఇంటిగ్రేడెట్ క్యాలండర్, విజువల్ వాయిస్ మెయిల్),
బ్లాక్‌బెర్రీ జడ్10: బ్లాక్ బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేక ఫీచర్లు: హబ్, ఫ్లో, బ్యాలన్స్, బీబీఎమ్ విత్ పీక్, స్టోరీ మేకర్, సేఫ్‌గార్డ్, బ్లాక్‌బెర్రీ వరల్డ్),

కెమెరా....
లూమియా 920: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్యూర్‌వ్యూ బ్రాండ్, సినిమాటోగ్రాఫ్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
బ్లాక్‌బెర్రీ జడ్10: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కెమెరా (3ఎక్స్ జూమింగ్),

స్టోరేజ్....
లూమియా 920: 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 7జీబి ఉచిత మైక్రోసాఫ్ట్ స్కై డ్రైవ్ స్టోరేజ్.
బ్లాక్‌బెర్రీ జడ్10: 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

కనెక్టువిటీ....
లూమియా 920: వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), 4జీ ఎల్‌టీఈ, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్,
బ్లాక్‌బెర్రీ జడ్10: వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), 4జీ ఎల్‌టీఈ,

బ్యాటరీ.....
లూమియా 920: 2000ఎమ్ఏహెచ్ బీపీ-4జీడబ్ల్యూ బ్యాటరీ,
బ్లాక్‌బెర్రీ జడ్10: రిమూవబుల్ 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర.....
లూమియా 920: రూ.38,199,
బ్లాక్‌బెర్రీ జడ్10: రూ.35,000.

తీర్పు.....
ఈ రెండు అధికముగింపు హ్యాండ్‌సెట్లు సరికొత్త ఆపరేటింగ్ సిస్టంలను కలిగి ఆకట్లుకునే ఫీచర్లను సొంతం చేసుకున్నాయి. లూమియ 920 ప్రత్యేకమైన స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ సపోర్ట్, నేటివ్ స్కైప్, ఆఫీస్ అప్లికేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. మరో వైపు బ్లాక్‌బెర్రీ జడ్10 పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. పెద్దదైన డిస్‌ప్లే, ఉత్తమ క్వాలిటి రేర్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, అధిక మొత్తంలో ఇంటర్నల్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని కోరుకునే వారికి లూమియా 920 ఉత్తమ ఎంపిక. మరోవైపు తక్కువ బరువు, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ, ఉత్తమ క్వాలిటీ ఫ్రంట్ కెమెరా ఆప్షన్‌లను కోరుకునే వారికి బ్లాక్‌బెర్రీ జడ్10 బెస్ట్ చాయిస్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X