బ్లాక్‌బెర్రీ జెడ్‌3 వచ్చేస్తోంది.. జూన్ 25న ముహూర్తం

Posted By:

కెనాడకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ, ఇండియన్ మార్కెట్లో తనకొత్త స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ జెడ్‌3 ఆవిష్కరణకు సంబంధించి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. న్యూఢిల్లీ వేదికగా  జూన్ 25న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా బ్లాక్‌బెర్రీ జెడ్‌3 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్ ధర రూ.11,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బ్లాక్‌బెర్రీ జెడ్‌3 వచ్చేస్తోంది.. జూన్ 25న ముహూర్తం

ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌‍లకు భారీ డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో బ్లాక్‌బెర్రీ గత కొంత కాలంగా ఫేలవమైన ఫలితాలను నమోదు చేస్తోంది. ఈ నేపధ్యంలో బ్లాక్‌బెర్రీ జెడ్‌3 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ పై మార్కెట్ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకుంది. బ్లాక్‌బెర్రీ జెడ్‌3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

5 అంగుళాల క్యూ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్స్),
బ్లాక్‌బెర్రీ 10.2.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకనే అవకాశం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బ్లాక్‌బెర్రీ జెడ్‌3 స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా బార్సిలోనా స్పెయిన్‌లో నిర్వహించిన 2014 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించటం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot