బ్లాక్‌బెర్రీ జెడ్3 స్మార్ట్‌ఫోన్... త్వరలో ఇండియన్ మార్కెట్లోకి

స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల విభాగంలో బ్లాక్‌బెర్రీ గత కొంతకాలంగా గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని ఏలాగైనా తిరిగి సంపాదించుకోవలన్న పట్టుదలతో ఉన్న ఈ కెనడా కంపెనీ బ్లాక్‌బెర్రీ జడ్3 పేరుతో ఓ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పలు నివేదికలు ఆధారంగా సేకరించిన వివరాల మేరకు బ్లాక్‌బెర్రీ జడ్3 మరికొద్ది వారాల్లో ఇండియన్ మార్కెట్లో విడదల కానుందని, రూ.11,000 ధర ట్యాగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనున్నారని తెలుస్తోంది. బ్లాక్‌బెర్రీ జడ్3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......
5 అంగుళాల పూర్తి టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 540×960పిక్సల్స్),
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతున్న నోకియా లూమియా 630, మోటో జీ స్మార్ట్ ఫోన్ లకు బ్లాక్‌బెర్రీ జెడ్3 పోటీగా నిలవనుంది.


Click it and Unblock the Notifications