బ్లాక్‌బెర్రీ జెడ్3@రూ.15,990, ప్రీఆర్డర్లు ప్రారంభం
కెనాడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ భారీ అంచనాలతో రూపొందించిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ జెడ్3ని బుధవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.15,999. దేశంలోని బ్లాక్‌బెర్రీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లతో పాటు ద మొబైల్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ రిటైలర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ముందస్తుబుకింగ్‌లను స్వీకరిస్తున్నాయి. ఈ డివైస్‌ను ప్రీఆర్డర్ చేసుకున్నవారికి ద మొబైల్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు రూ.1000 విలువ చేసే కూపన్‌లను ఉచితంగా ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఈ రిటైలర్ల వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్3 స్మార్ట్‌ఫోన్‌ను రూ.వెయ్యి తగ్గింపుతో రూ.14,999కే సొంతం చేసుకోవచ్చున్నమాట.

బ్లాక్‌బెర్రీ జెడ్3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్),బ్లాక్‌బెర్రీ 10.2.1 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ (ఎమ్ఎస్ఎమ్8230) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జ5జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 ఎల్ఈ), 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మందం 9.26 మిల్లీమీటర్లు, బరువు 164 గ్రాములు.


Click it and Unblock the Notifications