లిమిటెడ్ ఆఫర్.. రూ.3,200కే 3జీబి ర్యామ్, 4000mAh బ్యాటరీ ఫోన్

అమెరికాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Blu సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. బ్లు ఆర్1 ప్లస్ (Blu R1 Plus) పేరుతో విడుదలైన ఈ ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్‌తో వస్తోంది. అమెజాన్, బెస్ట్ బుయ్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లలో ఈ ఫోన్‌లను విక్రయిస్తున్నారు. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ ధర 50 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.3,200).

Read More : ఎవరూ హ్యాక్ చేయలని ఫోన్ వచ్చేస్తోంది..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ డిజైన్ ఇంకా డిస్‍‌ప్లే

బ్లు ఆర్1 ప్లస్ ఫోన్ 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కర్వుడ్ ఆన్-సెల్ గ్లాస్ ప్యానల్‌తో వస్తోంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ రక్షణ కవంచాలా నిలుస్తుంది.

హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్...

మీడియాటెక్ 6731 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం. డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4000mAh బ్యాటరీ (30 రోజులు స్టాండ్‌బై టైమ్‌తో)..

మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

బ్లు ఆర్1 ప్లస్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

కెమెరా స్పెసిఫికేషన్స్...

కెమెరా విషయానికి వచ్చేసరికి బ్లు ఆర్1 ప్లస్ ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది.

కనెక్టువిటీ ఫీచర్లు..

4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.0, మైక్రో యూఎస్బీ 2.0

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Blu R1 Plus launched with 4000mAh battery, 3GB RAM and more. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot