బ్లూమ్యాక్స్ ఇంపెక్స్ నుంచి ‘బ్లూ’ బ్రాండ్ మొబైల్స్

Posted By: Super

బ్లూమ్యాక్స్ ఇంపెక్స్ నుంచి ‘బ్లూ’ బ్రాండ్ మొబైల్స్

 

 

హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల పంపిణీ రంగంలో ఉన్న రాష్ట్ర కంపెనీ బ్లూమ్యాక్స్ ఇంపెక్స్ ‘బ్లూ’ బ్రాండ్ పేరుతో 7 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లతో పాటు రెండు టాబ్లెట్ పీసీలను ఆదివారం విడుదల చేసింది. వీటిని త్వరలోనే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విడుదల చేయునున్నారు. డ్యూయల్ సిమ్ ఆప్షన్‌తో కూడిన ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలు రూ.2,500లోపు ఉంటాయని బ్లూమ్యాక్స్ ఇంపెక్స్ సంస్థల చైర్మన్ రాజ్ కుమార్ హర్వానీ ఈ సందర్భంగా తెలిపారు. యూఎస్బీ డాంగిల్ సౌలభ్యతను కలిగి ఉన్న టాబ్లెట్ ధర రూ.5,500. 2జీ స్లిమ్‌స్లాట్ ఫీచర్‌తో పనిచేసే మరో టాబ్లెట్‌ను రూ.7,999కి ఆఫర్ చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.

మూడు నెలల్లో ఒక లక్ష మొబైల్ ఫోన్లు, 60 వేల ట్యాబ్లెట్లను విక్రయిస్తామని ఆయన చెప్పారు. 3జీ సిమ్‌తో పనిచేసే ట్యాబ్లెట్‌ను, 3.5-5 అంగుళాల స్క్రీన్ సైజులో ఆన్‌డ్రాయిడ్ ఫోన్లను కంపెనీ జనవరిలో మార్కెట్లోకి తేనుంది. ఆవిష్కరణ కార్యక్రమానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి, ఎంపీ మధుయాష్కీ, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి కామ్నా జెఠ్మలాని, ప్రముఖ సింగర్ బాబా సెహగల్ విచ్చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot