బొయింగ్ కంపెనీ నుంచి హై సెక్యూరిటీ స్మార్ట్‌ఫోన్

Posted By:

చికాగోకు చెందిన ప్రముఖ విమానాల తయారీ కంపెనీ బోయింగ్ కో (Boeing Co) బుధవారం బోయింగ్ బ్లాక్ (Boeing Black) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ సినిమాల్లో ఉపయోగించే స్పై గాడ్జెట్ తరహాలో ఈ హైసెక్యూరిటీ స్మార్ట్‌ఫోన్‌ను రూపకల్పన చేసారు.

 బొయింగ్ కంపెనీ నుంచి హై సెక్యూరిటీ స్మార్ట్‌ఫోన్

ఈ స్మార్ట్‌ఫోన్ కాల్స్‌ను గోప్యంగా ఉంచటమే కాదు, అపరిచిత వ్యక్తి ఫోన్ కేస్ తెరవాలని ప్రయత్నించినట్లయితే డివైస్‌లోని డేటాను పూర్తిగా డిలీట్ అయిపోతుంది. అంతేకాకుండా, ఆపరేట్ చేయడానికి సాధ్యకాని విధంగా ఫోన్ మారిపోతుంది.

ఈ ట్యాంపర్ - ప్రూఫ్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను బోయింగ్ కంపెనీ ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థలు ఇంకా గూఢచర్య ఏజెన్సీలలో పనిచేసే సిబ్బంది కోసం రూపొందించినట్లు ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. బోయింగ్ బ్లాక్ స్మార్ట్‌ఫోన్ స్సెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting