బోయింగ్ సంచలన ప్రకటన... రేగుతున్న ఉత్కంఠ..?

Posted By: Super

బోయింగ్ సంచలన ప్రకటన... రేగుతున్న ఉత్కంఠ..?

 

విమానాల తయారీ సంస్థ బోయింగ్ పై తాజాగా ప్రచురితమైన ఓ కధనం యూవత్ ప్రపంచాన్ని ఉత్కంఠకు లోను చేస్తోంది. విమానాల తయారీ రంగంలో 96 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను గడిచిన ఈ ప్రఖ్యాత బ్రాండ్, అత్యంత సురక్షితమైన స్మార్ట్‌ఫోన్ను రూపొందిస్తున్నట్లు ఓ ప్రముఖ ట్రేడ్ మ్యాగజైన్ వెల్లడించింది. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్న ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్  ఫీచర్లు తెలియాల్సి ఉంది. అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థను  ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేస్తున్నట్లు సమాచారం. మల్టీ నేషనల్ ఇతర గూఢచార సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఈ ఫోన్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుందని బోయింగ్ సంస్థల అధ్యక్షుడు రోగర్ క్రోన్ తెలిపారు.

బంధాలను బలపరిచే  శామ్‌సంగ్ చాట్ 322

ప్రపంచాన్ని శాసిస్తున్న శామ్‌సంగ్ చాట్ 322 పేరుతో ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మార్కెట్లో లభ్యమవుతున్న మన్నికతో కూడిన చవక హ్యాండ్‌సెట్‌లలో శామ్‌సంగ్ విడుదల చేసిన చాట్ 322 ఒకటి. డ్యూయల్ సిమ్ సపోర్ట్.. తక్కువ బరువు.. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ లాంటి గొప్ప అంశాలను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు.

శామ్‌సంగ్ చాట్ 322లో ఏర్పాటు చేసిన ఫీచర్లు అదే విధంగా స్పెసిఫికేషన్‌లు వివరాలు:

* డ్యూయల్ సిమ్ సపోర్ట్,

* శామ్‌సంగ్ ఆపరేటింగ్ సిస్టం,

* టీఎఫ్టీ డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 220X176 పిక్సల్స్),

* 1.3 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ (డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో),

* తక్కువ బరువు, నాజూకైన పోర్టబుల్ డిజైనింగ్,

* బ్యాటరీ టాక్‌టైమ్ 12 గంటలు, స్టాండ్‌బై 588 గంటలు,

* క్వర్టీ కీప్యాడ్,

* యాక్సెస్ నెట్ ఫ్రంట్ 3.5 వెబ్ బ్రౌజర్.

ఇవే కాకుండా వివిధ రకాలైన సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను డివైజ్‌లో ముందుగానే ఇన్‌బుల్ట్ చేశారు. శక్తివంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఒదిగి ఉన్న శామ్‌సంగ్ చాట్ 322 వ్యక్తులు మధ్యం బంధాలను మరింత బలపరుస్తుంది. విద్య, గృహ, వ్యాపార అవసరాలకు ఈ ఫోన్ ఉత్తమ ఎంపిక. ఇండియన్ మార్కెట్లో ధర రూ.3,700

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot