కేవలం రూ. 2 వేలకే Samsung Galaxy S9, S9 plus బుకింగ్‌

By Hazarath
|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లతో దూసుకువచ్చింది. గెలాక్సీ ఎస్‌ 8 కి సక్సెసర్‌గా ఎస్‌9, ఎస్‌9 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ లాంచ్‌ చేసింది. కొత్త కెమెరా, డేటా రక్షణ, వర్చువల్‌ రియాలీటీ తదితర టాప్-ఎండ్ ఫీచర్లతో వరల్డ్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ లో ఈ ఫోన్లను శాంసంగ్ ఆవిష్కరించింది. కాగా ఈ ఫోన్ల ఫ్రీ ఆర్డర్స్ మార్చి 2 నుంచి మొదలుకానున్నాయి. అలాగే ఎంపిక చేసిన మార్కెట్లలో మార్చి 16నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్ సందర్భంగా భారతీయ వినియోగదారులకు కంపెనీ ఓ కొత్త ఆఫర్‌ను అందిస్తోంది.

 

కంప్యూటర్ రామ్ సమస్యలు తెలుసుకోవడం ఎలా ?కంప్యూటర్ రామ్ సమస్యలు తెలుసుకోవడం ఎలా ?

రూ.2 వేలతో కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా ప్రీ ఆర్డర్‌

రూ.2 వేలతో కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా ప్రీ ఆర్డర్‌

ఈ కొత్త డివైస్‌లను కేవలం రూ.2 వేలతో కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు మార్కెట్లో సత్తా చాటుతాయని కంపెనీ ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే ధరల వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

 ధరలపై అనేక రూమర్లు

ధరలపై అనేక రూమర్లు

కాగా ఈ ఫోన్ల ధరలపై అనేక రూమర్లు వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఇండియా మార్కెట్లో రూ. 46 వేలు ఉంటుందని అంచనా. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ ధర రూ.54,400 ఉంటుందని అంచనా.అయితే కరెక్ట్ ధరలను ఇండియాలో జరగనున్న లాంచ్ ఈవెంట్లో కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు
 

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు

5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8 ఓరియో
1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
4జీబీర్యామ్‌
64జీబీస్టోరేజ్‌
12ఎంపీ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు

6.2 డిస్‌ప్లే
1440x2960 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8 ఓరియో
6జీబీ ర్యామ్‌
256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
64జీబీ స్టోరేజ్‌
12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్‌

ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్‌

రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్‌ స్టీరియో సౌండ్‌ స్పీకర్లు అమర్చింది. ఐ ఫోన్‌ ఎక్స్‌ యానిమోజీల మాదిరిగా మన ఫోటోలతో రకరకాల ఎమోజీలను సృష్టించుకునే అవకాశాన్నికూడా కల్పిస్తోంది.

అగ్‌మెంటెట్‌ రియాలిటీ ఎమోజీ ఫీచర్‌

అగ్‌మెంటెట్‌ రియాలిటీ ఎమోజీ ఫీచర్‌

కెమెరాలను మెరుగు పర్చడంతో పాటు ఎస్‌9 ప్లస్‌లో ద్వంద్వ రియర్‌ కెమెరాలను, అలాగే ఫేస్‌ రికగ్నిషన్‌, ఎఆర్‌ (అగ్‌మెంటెట్‌ రియాలిటీ) ఎమోజీ ఫీచర్‌ను జోడించింది.

Best Mobiles in India

English summary
Bookings for Samsung Galaxy S9 and S9+ start in India at Rs 2000 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X