మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరు మరంత మెరుగుపడాలంటే..?

Posted By: Prashanth

మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరు మరంత మెరుగుపడాలంటే..?

 

ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న ఆపరేటింగ్ సిస్టంలలో ఆండ్రాయిడ్ వోఎస్‌ను ఉత్తమమైనదిగా అభివర్ణిస్తారు. అనేక అప్లికేషన్‌లను ఈ ప్లాట్‌ఫామ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ వోఎస్‌ను ఒదిగి ఉన్న మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు మరింత మెరుగుపడాలంటే....

మీ అప్లికేషన్‌లను అప్ టూ డేట్‌గా ఉంచుకోండి:

మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోండి:

ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సహకరిస్తుంది. ఈ కారణంగా మీ ఫోన్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ కారణంగా ప్రాసెసర్ పనితీరు మందగిస్తుంది. ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను హ్యాండ్‌సెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకున్నట్లయితే వైరస్ బెడద తప్పుతుంది.

అనవసర అప్లికేషన్‌లను టర్ఫ్ ఆఫ్ చేసేయండి:

అవసరం లేకున్నా ఫోన్‌లోని అన్ని అప్లికేషన్‌లను ఓపెన్ చేయటం వల్ల ప్రాసెసింగ్ వేగం మందగిస్తుంది. ఈ సందర్భంలో హ్యాండ్‌సెట్ హ్యాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అవసరమైన అప్లికేషన్‌లను మాత్రమే రన్ చేసుకోవాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot