నోకియా పేరు ఇక వినపడదా..?

Posted By:

 నోకియా పేరు ఇక వినపడదా..?

నోకియా అభిమానులకు షాకింగ్ న్యూస్..? అవును, ఇటీవల ఈ ఫిన్‌ల్యాండ్ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీని సొంతం చేసుకున్న మైక్రోసాఫ్ట్ తన నోకియాను, మైక్రోసాఫ్ట్ లూమియాగా మార్చబోతోంది!. ఈ పేరు దాదాపుగా ఖరారైనట్లుగా  ఇంటర్నెట్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే వాస్తవమైతే నోకియా లూమియా ఫోన్‌లను ఇక పై మైక్రోసాఫ్ట్ లూమియా ఫోన్‌గా పిలవవల్సి ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ ఈ సమాచారాన్ని ఓ ప్రాంతీయ సోషల్ నెట్‌వర్కింగ్ పేజీలో పోస్ట్ చేసింది. వాస్తవానికి నోకియా పేరుతో వచ్చే ఫోన్‌లు ఏప్రిల్‌లోనే ఆగిపోగా, ఆ తరువాత నుంచి వస్తోన్న ఫోన్‌లు లూమియా పేరు మీదే మార్కెట్లో విడుదలవుతున్నాయి.

తాజా పరిణామాలు చూస్తుంటే, మైక్రోసాఫ్ట్ తన నోకియా బ్రాండ్‌ను ‘మైక్రోసాఫ్ట్ లూమియా'గా దాదాపు మార్చేసినట్లు స్పష్టమవుతోంది. మొబైల్ ఫోన్‌ల నిర్మాణ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలను గడించిన నోకియాను మరికొద్ది రోజుల్లో వినియోగదారులు మరిచిపోవల్సిందేనేమో!!.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Brand Nokia is dead, Microsoft to call phones Lumia. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot