వెదురుచెక్కతో స్మార్ట్ ఫోన్... వినాల్సిందే!!

Posted By: Prashanth

వెదురుచెక్కతో స్మార్ట్ ఫోన్... వినాల్సిందే!!

 

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం.. లండన్ కు చెందిన ఓ బ్రిటీష్ విద్యార్ధి వెదురు (bamboo)తో స్మార్ట్ ఫోన్ ను రూపొందించాడు. స్థానిక మిడిల్ సెక్స్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న కీరన్ స్కాట్ వుడ్ హౌస్ (23) ఈ హ్యాండ్ సెట్ కు ఈ రూపకల్పన చేశాడు. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతన్న మొబైల్ ఫోన్లలో వెరైటీ లోపించిన నేపధ్యంలో కాస్తంత భిన్నంగా ఆలోచించి తీరిక సమయంలో ఈ మొబైల్ ను డిజైన్ చేశాడు.

దీనికోసం సహజ ఎరువులతో నాలుగేళ్లు పెంచిన వెదురును ఉపయోగించాడు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ మొబైల్ ఫోన్‌కు ‘ఏడీజీరో’ పేరు ఖరారు చేశాడు. ఈ ఫోన్ ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. యూకే, యూరప్ ప్రాంతాల్లో ఈ డివైజ్ ను రిలీజ్ చేసేందుకు కీరన్ స్కాట్ సన్నాహాలు చేస్తున్నాడు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot