బీఎస్ఎన్ఎల్ ఉచిత టాక్‌టైమ్

Posted By:

ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. హుద్‌హుద్ తుఫాన్‌తో నష్టపోయిన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని తమ చందాదారులకు ఉచిత టాక్‌టైమ్‌తో పాటు ఉచిత టారిఫ్‌ను కూడా తగ్గించినట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

బీఎస్ఎన్ఎల్ ఉచిత టాక్‌టైమ్

తమ ప్రీపెయిడ్ ఖాతాదారులు ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్ చేసుకోవడానికి వీలుగా రూ.50 ఉచిత టాక్‌టైమ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉచిత టాక్ టైమ్ వ్యాలిడిటీ 30 రోజులు. అలానే ఈ నెల 20 నుంచి అమలులోకి వచ్చే విధంగా నెల రోజుల పాటు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు చేసే కాల్స్ పై నిమిషానికి టారిఫ్‌ను 5 పైసలు తగ్గించింది.

ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ పై ఈ తగ్గింపు నిమిషానికి 25 పైసలు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉచితంగా 50 సందేశాలను పంపుకునే అవకాశాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది. ఈ రాయితీలు ప్రీపెయిడ్‌తో పాటు పోస్ట్‌పెయిడ్ చందాదారులకు కూడా వర్తిస్తాయి. సెప్టంబర్ నెల బిల్లును చెల్లించడానికి పోస్ట్‌పెయిడ్ చందాదారులకు అదనంగా ఒక నెల గడువు ఇచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
BSNL again Proves its Stand for Social Responsibility by Offering Free Talktime for HudHud Cyclone Victims. Read more in Telugu Gizbot.....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting