Home
Mobile

రూ.151 రీఛార్జ్‌ ప్లాన్‌లో 25 కి పైగా ఓటీటీలు, 450 లైవ్‌ ఛానళ్లు.. పూర్తి వివరాలు

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) యూజర్లను ఆకట్టుకొనేందుకు కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో BiTV ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి రోజుల్లో ఈ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ ను ఉచితంగానే అందించింది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా OTT సబ్‌స్క్రిప్షన్‌ లతోపాటు లైవ్‌ టీవీ సదుపాయాన్ని అందిస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన కొత్త ప్లాన్‌ ను తీసుకొచ్చింది.

ఈ ప్లాన్‌ వివరాలను BSNL తమ X పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. రూ.151 తో BiTV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ( BSNL BiTV Rs151 Plan ) తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు 25 ఓటీటీ ప్లాట్‌ఫాంలను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 450 లైవ్‌ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.

BSNL BiTV Rs151 Plan

అయితే ప్లాన్‌ వ్యాలిడిటీ ఎన్నిరోజులపాటు ఉంటుందనే వివరాలను బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించలేదు. అయితే సుమారు 30 రోజుల వ్యాలిడిటి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్లాన్‌ మొబైల్‌ యూజర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

ఈ ప్లాన్‌ లో భాగంగా ఈ క్రింది ఓటీటీ ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకోవచ్చు.
> Aha
> Zee5
> ETV Win
> SonyLIV
> Epic ON
> Sun Nxt
> డిస్కవరీ ప్లస్‌ సహా లైన్స్‌గేట్‌, Shemaroo వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.

BiTV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ లో భాగంగా ఓటీటీ ప్రయోజనాలతోపాటు 450 కంటే ఎక్కువ లైవ్‌ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌, న్యూస్‌, రిజనల్‌ కంటెంట్‌ వంటి అనేక టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. BiTV మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

* బీఎస్‌ఎన్‌ఎల్‌ తన టెలికాం యూజర్లను ఆకట్టుకొనేందుకు వీలుగా ఇటీవల ఆజాదీ కా ప్లాన్‌ ను తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి ఈ ప్లాన్‌ అమల్లోకి వచ్చింది. కేవలం రూ.1 కే ఈ ప్లాన్‌ ను తీసుకొచ్చింది. ఆగస్టు నెలాఖరు వరకు ఈ ప్లాన్‌ అందుబాటులోకి ఉంటుంది.

ఈ ప్లాన్‌ కొత్తగా సిమ్‌ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. కేవలం రూ.1 కే అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.

* ఫైబర్‌ టీవీ బేసిక్‌ ప్లాన్‌ : BSNL ఇటీవల రూ.400 కే ఫైబర్‌ టీవీ బేసిక్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా ట్రిపుల్ ప్లే సర్వీసులను పొందవచ్చు. అంటే బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ సదుపాయం ఉంటుంది. ఈ ప్లాన్‌ లో 400 లకు పైగా టీవీ ఛానళ్లు, 9 OTT సబ్‌స్క్రిప్షన్‌ లను పొందవచ్చు.

దీంతోపాటు కాలింగ్‌ సదుపాయం, 20 Mbps వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ ను ఉపయోగించుకోవచ్చు. ఏపీ సర్కిల్‌లో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉందని తెలిపింది. BSNL FTTH యూజర్లు కేవలం రూ.140 చెల్లించి.. ఈ ట్రిపుల్‌ ప్లే సర్వీసులను పొందవచ్చని సూచించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL BiTV Rs151 Plan Offers more than 25 OTT subscriptions and 450 live Tv channels
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X