రూ.97కే నెలంతా అపరిమిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

Written By:

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జియో, ఎయిర్‌టెల్‌లాంటి సంస్థలు మార్కెట్లో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ దిగ్గజం BSNL 28 రోజులకే అపరిమిత కాలింగ్ , డేటానే ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్లాన్లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.

ఎగిరే Uber cabs వస్తున్నాయ్, ఇకపై ఆకాశ దేశ ప్రయాణం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫర్‌ వర్తించాలంటే..

ఈ ఆఫర్‌ వర్తించాలంటే రూ.2,200(జీఎస్‌టీతో కలిపి రూ.2,450) స్మార్ట్‌ఫోన్‌(మైక్రోమాక్స్‌)తో కలిపి సిమ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

రూ.97తో రీఛార్జ్‌ చేసుకుంటే

ఆ తర్వాత రూ.97తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజులకు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డేటా, నేషనల్‌ రోమింగ్‌ను ఉచితంగా అందుతాయి.

జియో, ఎయిర్‌టెల్‌లకు దీటుగా..

జియో, ఎయిర్‌టెల్‌లకు దీటుగా వినియోగదారులకు తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా, కాలింగ్‌ సేవలను అందిస్తున్నామని ఈ సందర్భంగా బీసీఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎ.పూర్ణచంద్రరావు తెలిపారు.

గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు..

గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పేద, మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్‌ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం ఈ ఫోన్‌ను అన్ని రిటైల్‌ షాప్‌ల్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL CGM launches Bharat-1 Plan in State More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot