బీఎస్ఎన్‌ఎల్ ఛాంపియన్ డీఎమ్6513@రూ.6,999

Posted By:

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. ఛాంపియన్ కంపెనీ భాగస్వామ్యంతో పెద్దతెర ఫాబ్లెట్ డివైస్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. బీఎస్ఎన్‌ఎల్ ఛాంపియన్ డీఎమ్6513 మోడల్‌లో లభ్యంకానున్న ఈ స్మార్ట్ కమ్యూనికేషన్ డివైస్‌ను మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫాబ్లెట్ ధర రూ.6,999. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

బీఎస్ఎన్‌ఎల్ ఛాంపియన్ డీఎమ్6513@రూ.6,999

6.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
3జీ కనెక్టువిటీ, వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4 గంటల టాక్‌టైమ్, 62 గంటల స్టాండ్‌బై టైమ్), ఎఫ్ఎమ్ రేడియో, జీ - సెన్సార్.

సంవత్సరం వారంటీ పై ఈ డివైస్‌ను పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్, స్నాప్‌డీల్, ఇబే, నాప్‌టాల్, ట్రేడస్, హోమ్‌షాప్ 18, ఇండియా టైమ్స్, రెడిఫ్, అమెజాన్, షాప్‌క్లూస్, ఇన్ఫీబీమ్ వంటి ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌ల వద్ద ఈ ఫాబ్లెట్ లభ్యమవుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot