బీఎస్ఎనల్, ఛాంపియన్ భాగస్వామ్యంతో చవక ధర డ్యూయల్ సిమ్ ఫోన్లు

Posted By:

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, ఛాంపియన్ కంపెనీలు సంయుక్త భాగస్వామ్యంతో రెండు చవక ధర డ్యూయల్ సిమ్ ఫోన్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేసాయి. అప్నా ఫోన్ సిరీస్ నుంచి ఎస్‌క్యూ241, ఎస్‌క్యూ281 మోడల్స్‌లో రూపుదిద్దుకున్న ఈ డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌లు దిగువ ఇంకా మధ్య తరగతి ప్రజానీకానికి మరింత చేరువుకాగలవు. ఎస్‌క్యూ241 మార్కెట్ ధర రూ.1399.

బీఎస్ఎనల్, ఛాంపియన్ భాగస్వామ్యంతో  చవక ధర డ్యూయల్ సిమ్ ఫోన్లు

ఎస్‌క్యూ281 మార్కెట్ ధర రూ.1699. ఈ ఫోన్‌ల కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ 1200నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఛాంపియన్ మొబైల్ ఫోన్ ఎస్ క్యూ281 ప్రత్యేకతలు:

డ్యూయల్ సిమ్ సపోర్ట్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
బ్లూటూత్, ఎఫ్ఎమ్ ప్లేయర్,
మ్యూజిక్ ఇంకా వీడియో ప్లేయర్, వీడియో రికార్డర్,
జీపీఆర్ఎస్ కనక్టువిటీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, టార్చ్ లైట్,
టీఎఫ్ కార్డ్ సపోర్ట్.
1200నిమిషాల బీఎస్ఎన్ఎల్ టాక్‌టైమ్ ఉచితం.

బీఎస్ఎన్ఎల్ ఛాంపియన్ ఎస్‌క్యూ241 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

డ్యూయల్ సిమ్,
వీడియో ఇంకా మ్యూజిక్ ప్లేయర్,
ఎఫ్ఎమ్ ప్లేయర్,
శక్తివంతమైన స్పీకర్లు,
శక్తివంతమైన బ్యాటరీ,
జీపీఆర్ఎస్, బ్లూటూత్,
కెమెరా, టీఎఫ్ కార్డ్ సపోర్ట్,
1200నిమిషాల బీఎస్ఎన్ఎల్ టాక్‌టైమ్ ఉచితం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot