బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

|

దిగువ ఇంకా మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, ఛాంపియన్ కంపెనీలు సంయుక్త భాగస్వామ్యంతో రెండు చవక ధర డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేసాయి. బీఎస్ఎన్ఎల్ ఛాంపియన్ మై ఫోన్ ఎస్ఎమ్3512, ఎస్ఎమ్3513 శ్రేణిల్లో విడుదలైన ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలు రూ.3,225, రూ.4,499గా ఉన్నాయి.

 
 బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

బీఎస్ఎన్ఎల్ ఛాంపియన్ మొబైల్ మై ఫోన్ ఎస్ఎమ్3512 స్పెసిఫికేషన్లు:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డ్యుయల్ కోర్ ప్రాసెసర్, ర్యామ్ సామర్ధ్యం తెలియాల్సి ఉంది, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, జీపీఆర్ఎస్, బ్లూటూత్, జీ సెన్సార్, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), లీ ఐయాన్ 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 350 గంటల స్టాండ్‌బై టైమ్).

బీఎస్ఎన్ఎల్ ఛాంపియన్ మొబైల్ మై ఫోన్ ఎస్ఎమ్3513 స్పెసిఫికేషన్లు:

డ్యుయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3జీ, డ్యుయల్ సిమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో, ఎఫ్ఎమ్ రికార్డింగ్, వై-ఫై, జీ-సెన్సార్, శక్తివంతమైన బ్యాటరీ. జీపీఆర్ఎస్, బ్లూటూత్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఈ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లను అందిస్తోంది. ఔత్సాహికులు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, ఈబే రిటైలింగ్ స్టోర్లవద్ద కొనుగోలు చేయవచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X