సామాన్యుడి కోసం బీఎస్ఎన్ఎన్ ‘పాంటా భారత్ ఫోన్’

Posted By:

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), పాంటెల్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో సామాన్యుడి అవసరాలను తీర్చే ప్రత్యేకమైన ఇ-గవర్నెన్స్ అప్లికేషన్‌లతో కూడిన చవక ధర ఇంటర్నెట్ యాక్సిస్ ఫోన్ ‘భారత్ ఫోన్'ను శుక్రవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 3 అంగుళాల డిస్‌ప్లేతో రూపకల్పన చేయబడిన ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ విలువ రూ.1,099. జూన్15 నుంచి ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ చవక ధర మొబైల్ ఫోన్‌ను పాంటెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వృద్థి చేసింది. సర్వీస్ ప్రొవైడర్‌గా బీఎస్ఎన్ఎల్ వ్యవహరిస్తుంది.

సామాన్యుడి కోసం బీఎస్ఎన్ఎన్ ‘పాంటా భారత్ ఫోన్’

3 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, 1800ఎమ్ఏహెచ్ ఎల్ఏఎన్ బ్యాటరీ. 64 ఎంబి ర్యామ్, 64 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లను ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసారు. ఫోన్ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ 1200 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, టెలి మెడికల్ కేర్ డెలివరీ, ఇ-మెయిల్, ఫేస్‌బుక్ వంటి సేవలతో పాటు జావా గేమ్స్, ఆటో వాయిస్‌కాల్ రికార్డింగ్ వంటి సౌకర్యాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. జూన్ 15 నుంచి ఈ చవర ధర ఇంటర్నెట్ యాక్సెస్ ఫోన్‌ను అన్ని బీఎస్ఎన్ఎల్ కేంద్రాలు ఇంకా ఎంపిక చేయబడని తపాళా కేంద్రాల్లో విక్రయించనున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot