పెద్ద మొత్తంలో రీఛార్జుల పై 10 శాతం అదనపు టాక్‌టైమ్: బీఎస్ఎన్ఎల్

పెద్దమొత్తం కలిగిన రీఛార్జుల పై 10 శాతం అదనపు టాక్ టైమ్ ను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.1,000 నుంచి రూ.2,900 వరకు టాక్ టైమ్ బ్యాలన్స్ ను కొనుగోలు చేసేవారికి విలువకు మించి 10 శాతం అదనపు టాక్ టైమ్ లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ నెల 24 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. అలాగే రూ.200 నుంచి రూ.990 విలువ చేసే రీఛార్జ్ కూపన్ల పై పూర్తి టాక్‌టైమ్‌ను పొందవచ్చు. ఈ నెల 24 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
క్రిస్టమస్, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కోసం ‘ఫెస్టివల్ ఫుల్ టాక్‌టైమ్ ఆఫర్'ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్‌లో పలు రీఛార్జుల పై పూర్తి టాక్‌టైమ్‌ను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఏపీ టెలికాం సర్కిల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రత్యేకమైన ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా ఈ నెలాఖరు వరకు రూ.100 నుంచి 190 రీఛార్జ్ కూపన్ల పై పూర్తి టాక్‌టెమ్‌ను పొందవచ్చు. అలాగే, రూ.220 కూపన్ల పై మార్చి 16 వరకు, రూ.550 కూపన్ల పై మార్చి 3 వరకు పూర్తి టాక్‌టెమ్‌ను అందిస్తామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








