మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

|

పాంటెల్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఓ ప్రారంభ స్థాయి ఫీచర్ ఫోన్ సహా రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా ఓ ట్యాబ్లెట్ పీసీని శుక్రవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ స్థాయి ఫీచర్ ఫోన్ ‘పెంటాభారత్ ఫోన్ పీఎఫ్300' ధర రూ.1,799. ఫోన్ కొనుగోలు పై 1200 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.

 

ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో విడుదలైన పీఎస్650, పీఎస్501 మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,999, రూ.6,999 ధరలను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై 3జీబి 3జీ బీఎస్ఎన్ఎల్ డేటాతో పాటు 300 నిమిషాల టాక్‌టైమ్‌ను బీఎస్ఎన్ఎల్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో విడుదల చేయబడిన ట్యాబ్లెట్ పీసీ పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్707సీ రూ.6,999 ధరకు లభ్యంకానుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ హోమ్ షాప్18 ఈడివైజ్‌లను విక్రయిస్తోంది. బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన డివైజ్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్  కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

పెంటా భారత్ ఫోన్ పీఎఫ్300 ప్రధాన ఫీచర్లు:

3 అంగుళాల డిస్‌ప్లే,
జావా సాఫ్ట్‌వేర్,
ఈమెయిల్, ఫేస్‌బుక్, మ్యూజిక్ ఇంకా వీడియో డౌన్ లోడింగ్ సదుపాయం, జావా గేమ్స్,
1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
బ్లూటూత్, 1800ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ,
64ఎంబి ర్యామ్,
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
ఎస్ఎంఎస్ షెడ్యూలర్, మల్టీమీడియా గేమింగ్, మొబైల్ ట్రాకర్,
ఫోన్ ధర రూ.1799
ఫోన్ కొనుగోలు పై 1200 నిమిషాల టాక్ టైమ్ ఉచితం .

 

మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్  కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

పెంటా స్మార్ట్ పీఎస్650 ప్రధాన ఫీచర్లు:

3జీ కనెక్టువిటీ,
6.5 అంగుళాల స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ ఏ7 డ్యూయల్ కోర్ సీపీయూ,
మాలీ 400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా.
ఫోన్ ధర రూ.7,999.
కొనుగోలు పై 3జీబి 3జీ బీఎస్ఎన్ఎల్ డేటా ఇంకా 300 నిమిషాల టాక్‌టైమ్‌ను ఉచితంగా పొందవచ్చు.

 

మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్  కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
 

మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

పెంటా స్మార్ట్ పీఎస్501 స్మార్ట్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల డిస్‌ప్లే,
ముందుగానే లోడ్ చేయబడిన 15జీబి క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ,
యాంటీ-వైరస్ ప్రొటెక్షన్,
1.2గిగాహెట్జ్ ఏ7 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎండి డీడీఆర్3 ర్యామ్
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
ధర రూ.6,999.
ఫోన్ కొనుగోలు పై కొనుగోలు పై 3జీబి 3జీ బీఎస్ఎన్ఎల్ డేటా ఇంకా 300 నిమిషాల టాక్ టైమ్ ను ఉచితంగా పొందవచ్చు.

 

మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్  కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

పెంటా టీప్యాడ్ డబ్ల్యూఎస్707సీ ట్యాబ్లెట్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, ట్యాబ్లెట్ కొనుగోలు పై 3జీబి 3జీ బీఎస్ఎన్ఎల్ డేటా ఇంకా 300 నిమిషాల టాక్ టైమ్‌ను ఉచితంగా పొందవచ్చు. ధర రూ.6,999.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X