Home
Mobile

ధర రూ.600 కంటే తక్కువ ధరలో రోజువారీ 3GB డేటా, 84 రోజుల వ్యాలిడిటీతో BSNL రీఛార్జ్‌ ప్లాన్‌..!

BSNL గత మూడు నాలుగు నెలలుగా లక్షలాది మంది కొత్త యూజర్లను సంపాదించుకుంది. ప్రైవేటు టెలికాం సంస్థలకు పోటీగా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో BSNL నెట్‌వర్క్‌లోకి భారీగా యూజర్లు చేరారు. త్వరలో పూర్తి స్థాయిలో 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతోపాటు 5G నెట్‌వర్క్‌ ను కూడా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత శాఖ మంత్రి ఇప్పటికే తెలిపింది. అయితే ప్రస్తుతం తక్కువ ధరలో BSNL అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది.

ప్రస్తుతం BSNL 3GB రోజువారీ డేటాతో అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌ను కలిగి ఉంది. రూ.599 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. మొత్తం ప్లాన్‌లో భాగంగా 252GB డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL RS599 Prepaid Recharge Plan

దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరలో మరిన్ని ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. BSNL రూ.347 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 54 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా కాలింగ్‌ సహా రోజువారి 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 108GB డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.397 రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా తొలి 30 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2GB డేటా, ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. 30 రోజుల తర్వాత సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉంటుంది.

BSNL రూ.485 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఫలితంగా ప్లాన్‌లో మొత్తంగా 160GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 80 రోజులుగా ఉంది.

BSNL రూ.797 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ లో భాగంగా 300 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా మొదటి 60 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు డేటా పరంగా తొలి 60 రోజులపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు.

BSNL రూ.997 రీఛార్జ్ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 160 రోజులుగా ఉంది. రూ.1198 రీఛార్జ్‌ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతి నెల 300 నిమిషాల కాల్స్‌, 3GB డేటా, 30 SMS లను ఉపయోగించుకోవచ్చు.

BSNL రూ.1499 రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా 336 రోజుల వ్యాలిడిటిని పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ మరియు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా ఈ ప్లాన్‌ ద్వారా 24GB డేటాను పొందవచ్చు. ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ మరియు కేవలం కాలింగ్‌ కోసం సిమ్‌ కార్డు వినియోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS599 Prepaid Recharge Plan offers 3GB daily data with 84 days validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X