మరో సంచలనం, జియో ఫోన్ కన్నా తక్కువే ధరకే BSNL ఫీచర్ ఫోన్ !

Written By:

జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి రాకముందే మిగతా టెల్కోలు తమ ఫీచర్ ఫోన్లను తీసుకురావాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ రూ.2500కు స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఐడియా సైతం అదే బాటలో నడుస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఫీచర్‌ ఫోన్లను లాంచ్‌ చేయబోతుందట.‍

తొలిసారిగా పేటీఎమ్ నుంచి భారీ ఆఫర్లు, రూ.501 కోట్లకు పైనే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లావా, మైక్రోమ్యాక్స్‌లతో కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం

ఈ ఫీచర్ ఫోన్ కోసం దేశీయ మొబైల్‌ డివైజ్‌ తయారీదారులు లావా, మైక్రోమ్యాక్స్‌లతో కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. లావా, మైక్రోమ్యాక్స్‌ వంటి డివైజ్‌ తయారీదారులతో కలిసి సొంత మోడల్‌లో కో-బ్రాండెడ్‌ ఫీచర్‌ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ అనుపమ శ్రీవాస్తవ చెప్పారు.

2000 రూపాయల ధరలో

2000 రూపాయల ధరలో, అన్ని ఉచిత ఆఫర్లతో అక్టోబర్‌లో కో-బ్రాండెడ్‌ ఫీచర్‌ ఫోన్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవిష్కరించబోతుందని వెల్లడైంది.

ఉచిత వాయిస్‌ కాలింగ్‌

ఈ ఫోన్లు మార్కెట్‌లో ఉన్న ప్రస్తుత వాయిస్‌ ప్యాకేజీల కంటే ఎక్కువ మొత్తంలో అందిస్తాయన్నారు. ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాన్ని కూడా అందించబోతున్నట్టు తెలిపారు.

10.5 కోట్ల సబ్‌స్క్రైబర్లకు

బీఎస్‌ఎన్‌ఎల్‌ 10.5 కోట్ల సబ్‌స్క్రైబర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా ఈ రెండు కంపెనీలు కో-బ్రాండెడ్‌ డివైజ్‌లను రూపొందిస్తున్నాయి. దీంతో దీపావళి పండుగ కంటే ముందస్తుగానే ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌ పూర్తిగా కుదుపులకు లోనుకానున్నట్టు తెలుస్తోంది.

మార్కెట్లో వార్ కి తెర

ఓ వైపు జియో ఫోన్‌, మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌ కో-బ్రాండెడ్‌ ఫీచర్‌ ఫోన్లు.. మార్కెట్లో వార్ కి తెర లేచినట్లుగా తెలుస్తోంది. ఫీచర్‌ఫోన్ల ద్వారా వస్తున్న రెవెన్యూలు 15 శాతం ఉండగా.. ఈ డివైజ్‌లు మార్కెట్‌లో 50 శాతం స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫీచర్‌ ఫోన్‌ లాంచింగ్‌పై

ఇటీవల వెల్లడైన రిపోర్టుల ప్రకారం 85 శాతం ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లలోకి మారడానికి సిద్ధంగా లేనట్టు తెలిసింది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫీచర్‌ ఫోన్‌ లాంచింగ్‌పై లావా కానీ, మైక్రోమ్యాక్స్‌ కానీ స్పందించలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL to team up with Lava, Micromax to launch affordable co-branded feature phones Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot