బడ్జెట్ 2014: తక్కువ ధర ఫోన్ల పై దిగుమతి సుంకం 6శాతానికి పెంపు

Posted By:

రూ.2,000కు దిగువ ధరల్లో లభ్యమవుతున్న మొబైల్ ఫోన్‌ల ధరలు తాజా బడ్జెట్ ప్రతిపాదనల నేపధ్యంలో మరింత పెరగనున్నాయి. ఇప్పటి వరకు రూ.2,000 ఖరీదులోపు  సెల్‌ఫోన్‌లకు 1 శాతం దిగుమతి సుంకం రూ.2,000 పై చిలుకు ధరల్లో లభ్యమవుతున్న మొబైల్ ఫోన్ల పై 6 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తూ వచ్చారు.

తాజా ప్రతిపాదనల ప్రకారం ఇక పై అన్ని ఫోన్లపైనా 6 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తూ మధ్యంతర బడ్జెట్ 2014-15లో ఆర్ధిక మంత్రి చిదంబరం నిర్ణయాన్ని తీుసుకున్నారు. ఫలితంగా రూ.2,000లోపు మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ పేర్కొంది.

తక్కువ ధర ఫోన్ల పై దిగుమతి సుంకం 6శాతానికి పెంపు

ప్రస్తుతం రూ.1000 (ఎంఆర్‌పీ) కలిగిన మొబైల్ ఫోన్‌లను దిగుమతి చేసుకుంటే, ఆ విలువలోని రూ.650పైన 1 శాతం దిగుమతి సుంకంగా రూ.6.50ను చెల్లిస్తున్నారు. అంటే రూ.1000 (ఎంఆర్‌పీ) కలిగిన సెల్ ఫోన్‌కు దిగుమతి సుంకం క్రింద రూ.6.50 చెల్లిస్లున్నారు. రూ.2,000 (ఎంఆర్‌పీ) కలిగిన ఇంపోర్టెడ్ సెల్‌ఫోన్‌కు దిగుమతి సుంకం క్రింద రూ.13.00 చెల్లిస్లున్నారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనల నేపధ్యంలో రూ.2000 (ఎంఆర్‌పీ) కలిగిన ఇంపోర్టెడ్ సెల్‌ఫోన్‌కు దిగుమతి సుంకం క్రింద రూ.78 చెల్లించాల్సి ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot