బడ్జెట్ 2017, ఫోన్‌ల ధరలు ఎలా ఉండబోతున్నాయ్..?

స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి సంబంధించి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల పై 2 శాతం ప్రత్యేక అదనపు సుంకాన్నివిధించాలని కేంద్రం ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల పై ఇప్పటి వరకు ఈ ఏ విధమైన ప్రత్యేకమైన అదనపు సుంకాలు లేవు.

Read More : కంప్యూటర్‌ను టీవీలా మార్చటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం

మొబైల్ ఫోన్ మొత్తం ఖరీదులో 40 నుంచి 50 శాతం వాటాను ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు కలిగి ఉండటం, వీటి పై తాజాగా ప్రత్యేక పన్నును విధించటం వంటి అంశాలు కారణంగా మొబైల్ ఫోన్‌ల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశముంది.

దేశీయంగా పీసీబీల తయారీ ఊపందుకునే అవకాశం..

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో దేశీయంగా పీసీబీల తయారీ ఊపందుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుతానికి సామ్‌సంగ్ మాత్రమే..

ప్రస్తుతానికి సామ్‌సంగ్ మాత్రమే భారత్‌లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను తయారు చేసుకుని తమ ఫోన్‌లలో వినియోగించుకుంటోంది. దేశంలో తయారయ్యే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల పై ఎటువంటి పన్ను లేకపోవటంతో త్వరలోనే మరిన్ని కంపెనీలు దేశీయంగా పీసీబీలును తయారు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో ఫోన్ విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొబైల్ పరిశ్రమ స్వాగితిస్తోంది.

1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్

2017-18 బడ్జెట్‌లో డిజిటిల్ ఇండియాకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఆప్టిక్ ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టువిటీని ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

రూ.10,000 కోట్ల నిధులు

ఇప్పటికే 1,50,000 కిలో మీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్‌ను విస్తరించామని, భారత్‌నెట్ ప్రోగ్రామ్ క్రింద రూ.10,000 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. భారత్‌నెట్ ఫేజ్ 1 పనుల్లో మార్చి 2017 నాటికి 100,000 పంచాయితీల్లో ఆప్టిక్ ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

భారత్‌నెట్ ఫేజ్ 2 పనులు..

భారత్‌నెట్ ఫేజ్ 2 పనులు 2017 మధ్యలో ప్రారంభమై సెప్టంబర్ 2018 నాటికి పూర్తవుతాయని అరుణ్ జైట్లీ తెలిపారు. భారత్‌నెట్ ఫేజ్ 2 పనులు పూర్తి అయ్యే నాటికి 1,50,000 పంచాయితీల్లో హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వచ్చేస్తాయని మంతి తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Budget 2017: Mobile Phones Likely to See Price Hike. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting