చైనాతో పాటు విదేశీ ఫోన్లకు చుక్కలు చూపించిన బడ్జెట్ 2018

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఆఖరి బడ్జెట్‌ అయిన Union Budget 2018ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.

By Hazarath
|

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఆఖరి బడ్జెట్‌ అయిన Union Budget 2018ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అయితే ఇందులో టెక్నాలజీ రంగానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు చేశారు.

Budget 2018 Prices of imported mobile phones to rise on custom duty hike to 20%

ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై customs dutyని 20శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్లో పొందుపరిచారు. అలాగే ఇతర విడిభాగాలపై 15 శాతం customs duty విధించారు. దీంతో దేశీయరంగం మరింత ఊపును సంతరించుకోనుంది. దేశీయ తయారీదారులను ప్రోత్సాహించే విధంగాఈ బడ్జెట్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

<strong>శాంసంగ్‌లో భారీగా ఉద్యోగ అవకాశాలు, నియామకం ఎలా అంటే..?</strong>శాంసంగ్‌లో భారీగా ఉద్యోగ అవకాశాలు, నియామకం ఎలా అంటే..?

ఆపిల్, శాంసంగ్, అలాగే చైనా కంపెనీలపై..

ఆపిల్, శాంసంగ్, అలాగే చైనా కంపెనీలపై..

దేశీయ రంగాన్ని ఏలుతున్న విదేశీ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్, అలాగే చైనా కంపెనీలపై పెరిగిన customs duty ప్రభావం భారీగానే పడనుంది. ఇండియాలోకి అత్యధికంగా దిగుమతి అవుతున్న ఈ కంపెనీల ఫోన్లపై అమ్మకాల ప్రభావం ఎక్కువగానే ఉండనుంది.

 ముఖ్యంగా చైనా కంపెనీలకు

ముఖ్యంగా చైనా కంపెనీలకు

ముఖ్యంగా చైనా కంపెనీలకు ఈ కస్టమ్స్ డ్యూటీ దెబ్బతో దిమ్మతిరగనుంది. మనదేశంలో ఎక్కువ శాతం మొబైల్స్ చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఆ దేశం నుంచి వచ్చిన ఫోన్లే ఇండియా మార్కెట్ మొత్తాన్ని ఆక్రమించాయి.

దేశీయ తయారీ రంగం..
 

దేశీయ తయారీ రంగం..

పెరిగిన customs dutyతో దేశీయ తయారీ రంగం పుంజుకోనుంది. మేక్ ఇన్ ఇండియాకు మరింతగా బూస్ట్ రానుంది. ఇండియాలోని మొబైల్ తయారీ కంపెనీలకు పెరిగిన కస్టమ్స్ డ్యూటీ మరింత ఊపునిస్తూ కంపెనీల నుంచి మరిన్ని దేశీయ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.

 గత 12 నెలల్లో customs duty పెరగడం ఇది మూడో సారి..

గత 12 నెలల్లో customs duty పెరగడం ఇది మూడో సారి..

కాగా గత 12 నెలల్లో customs duty పెరగడం ఇది మూడో సారి. ఫిబ్రవరి 2017లో customs dutyని 10 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత డిసెంబర్ నెలలో ఇది 15 శాతానికి పెంచారు. ఇప్పుడు ఇది 20 శాతానికి పెరిగింది.

ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై..

ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై..

వీటితో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. printed circuit boards (PCBs), camera modules and connectors లాంటి వాటిపై customs dutyని 15 శాతానికి పరిమితం చేసింది. తద్వారా మేక్ ఇన్ ఇండియాకి మరింత ఊపునిచ్చేలా ఉంది.

ముందు ముందు ఎలాంటి పరిణామాలు ..

ముందు ముందు ఎలాంటి పరిణామాలు ..

కాగా దీనిపై Indian Cellular Association president Pankaj Mohindroo మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అయితే ఇది ఆచరణలో కొంచెం కష్టమయ్యే అవకాశం ఉందని ముందు ముందు ఎలాంటి పరిణామాలు వస్తాయో వేచి చూడాలని తెలిపారు. దీనికి కారణం ప్రతి తయారీ వస్తువు విడిభాగాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమేనని తెలిపారు.

దేశీయ కంపెనీలు

దేశీయ కంపెనీలు

ఇక దేశీయ కంపెనీలు కొన్ని వచ్చే నెల నుంచి తయారీ రంగాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. లావా లాంటి కంపెనీలు వచ్చే నెల నుంచి మొబైల్ తయారీని ప్రారంభిస్తుండటంతో.. ఈ పెరిగిన customs duty ఆ కంపెనీలకు మరింత ఉపయోగకరంగా మారనున్నట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Prices of imported mobile phones to rise on custom duty hike to 20%; boost to Make in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X