నోకియా బడ్జెట్ మొబైల్స్ నోకియా సి3-01, ఎక్స్2-01

Posted By: Staff

నోకియా బడ్జెట్ మొబైల్స్ నోకియా సి3-01, ఎక్స్2-01

ప్రస్తుతం మొబైల్ పరిశ్రమలో గట్టి పోటీ ఉండడంతో ప్రతి మొబైల్ తయారీదారు సంస్దలు కూడా కొత్త కొత్త ఫీచర్స్‌ని ప్రవేశపెట్టి మార్కెట్లో తమ సత్తాని చాటుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా నోకియా తన అమ్ముల పోది నుండి రెండు బడ్జెట్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ రెండు మోడల్స్ నోకియా సి3-01, నోకియా ఎక్స్2-01. రెండు మొబైల్స్‌ని కూడా క్వర్టీ కీప్యాడ్‌తో చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. నోకియా సి3-01 టచ్ అండ్ టైప్ ఫీచర్‌ని కలిగి ఉండి 2.4 ఇంచ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది.

ఇక నోకియా ఎక్స్2-01 మాత్రం 2.4 ఇంచ్ డిస్ ప్లేతో పాటు ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉంది. రెండు మొబైల్స్ కూడా కెమెరా ఫీచర్‌ని కలిగి ఉన్నప్పటికీ కూడా నోకియా ఎక్స్2-01 విజిఎ కెమెరాతో పోల్చితే నోకియా సి3-01 మాత్రం 5మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. రెండు కెమెరాలు కూడా విజిఎ ఫార్మెట్‌లో వీడియో రికార్డింగ్ ఫెసిలిటీని అందిస్తున్నాయి. అంతేకాకుండా నోకియా సి3-01కెమెరాకు అదనపు హాంగులు ఎల్‌ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, డిజిటల్ జూమ్ మొదలగునవి ప్రత్యేకం. నోకియా ఎక్స్ 2-01 మాత్రం ఒక్క డిజిటల్ జూమ్‌నే కలిగి ఉంది.

మార్కెట్లో ప్రస్తుతం కొత్త మల్టీమీడియా ఫార్మెట్లు అయినటువంటి MP3, WAV, WMV ఆడియో, వీడియోలను ఇవి సపోర్ట్ చేస్తాయి. వీటితో పాటు 3.5 mm ఆడియో జాక్, ఎఫ్‌ఎమ్ రేడియా ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం నోకియా ఎక్స్2-01 బ్లూటూత్, యుఎస్‌బి సింక్‌లను సపోర్ట్ చేస్తే అదే నోకియా సి3-01 మాత్రం బ్లూటూత్, వై-పై, పిసి కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఇక 3జి ఇంటర్నెట్ టెక్నాలజీలు అయిన EDGE ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు.

రెండు మొబైల్స్‌లో కూడా మొమొరీ ఎక్సాండ్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. నోకియా సి3-01 మొమొరీని 32జిబి వరకు సపోర్ట్ చేస్తే, నోకియా ఎక్స్2-01 మాత్రం 16జిబి వరకు మొమొరీని సపోర్ట్ చేస్తుంది. రెండు మొబైల్స్ కూడా జావా గేమ్స్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక ఖరీదు విషయానికి వస్తే నోకియా ఎక్స్ 2-01 మాత్రం కేవలం రూ 3400 కాగా, అదే నోకియా సి3-01 మాత్రం రూ 8075గా నిర్ణయించడమైంది. రెండు మొబైల్స్‌లలో ఒకటి మిని స్మార్ట్ పోన్ కాగా, మరోకటి బేసిక్ లెవల్ ఫోన్‌గా పరిగణించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot