ఎల్‌జీ, శ్యామ్‌సంగ్‌ల మద్య బడ్జెట్ వార్

By Super
|
Samsung Replenish
ఇండియన్ మొబైల్ పరిశ్రమ జాతీయంగా, అంతర్జాతీయంగా బాగా అభివృద్ది చెందుతుంది. అసలు ఇండియన్ మొబైల్ మార్కెట్ ఇంతలా అభివృద్ది చెందడానికి కారణం తయారీదారులు మద్య తరగతి ఫ్యామిలీలను దృష్టిలో ఉంచుకోని బడ్జెట్ ఫోన్స్‌ని తయారు చేయడమేనని అంటున్నారు. ఇండియాలో అప్పర్ క్లాస్ పాపులేషన్ కూడా బాగా పెరిగినప్పటికీ, ఇండియన్ ఎకానమీ మాత్రం ఆధారపడేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల మీదనే అనేది జగమెరిగిన సత్యం.

అందుకే శ్యామ్‌సంగ్, ఎల్‌జీ తమ ఉత్పత్తులను ఎల్లప్పడూ మద్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోని మాత్రమే తయారు చేస్తారు. అలా ఆ రెండు కంపెనీలు తయారు చేసిన మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఎల్‌జీ కంపెనీ నుండి త్వరలో మార్కెట్లోకి ఎల్‌జీ అటిన్యూ, శ్యామ్‌సంగ్ నుండి శ్యామ్‌సంగ్ రిప్లినెష్ విడుదల అవుతున్నాయి. ఎల్‌జీ అటిన్యూ మాత్రం ఎక్కువ ఫచర్స్ కలిగిఉన్న సింపుల్, బేసిక్ మోడల్. అదే శ్యామ్‌సంగ్ రిప్లినెష్ మాత్రం హై ఎండ్ మోడల్. శ్యామ్‌సంగ్ రిప్లినెష్ మోడల్ క్లాసీ టచ్ అండ్ టైప్ ఫోన్. 2.8 ఇంచ్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్‌ని కలిగిఉండి క్వర్టీ కీప్యాడ్ దీని సోంతం.

ఎల్‌జీ అటిన్యూ మాత్రం 2.8 ఇంచ్ డిస్ ప్లేని కలిగిఉండి ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్‌ని దీని సోంతం. శ్యామ్‌సంగ్ రిప్లినెష్ మాత్రం ఆండ్రాయిడ్ ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. రెండు మొబైల్ ఫోన్స్ కూడా మల్టీమీడియా విషయంలో కస్టమర్స్‌ని నిరాశకు మాత్రం గురిచేయవు. ఆడియో, వీడియో కేటగిరిలకు చెందిన అన్ని రకాల ఫార్మెట్స్‌ని ఇవి సపోర్ట్ చేస్తాయి. వీటితో పాటు ఎఫ్‌ఎమ్ రేడియో, యూనివర్సల్ హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ లభిస్తుంది.

కెమెరా విషయంలో శ్యామ్‌సంగ్ రిప్లినెష్ మాత్రం కొంచెం బెటర్ అనిపిస్తుంది. అందుకు కారణం శ్యామ్‌సంగ్ రిప్లినెష్ 2మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండగా, అదే ఎల్‌జీ అటిన్యూ మాత్రం 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. రెండు మొబైల్స్ కూడా బ్లూటూత్, జిపిఆర్‌ఎస్ ఇంటర్నెట్ కనెక్టివిటినీ సోపర్ట్ చేస్తున్నాయి. అసలు యుద్దం ఈ రెండింటి మద్య ధరల దగ్గర మొదలైంది. ఎల్‌జీ అటిన్యూ ధర రూ 4000కాగా, అదే శ్యామ్‌సంగ్ రిప్లినెష్ ధర మాత్రం ఇంకా మార్కెట్లో తెలియజేయలేదు. శ్యామ్‌సంగ్ రిప్లినెష్ ధర కూడా రూ 4000 నుండి రూ 5000 వరకు ఉంటే మాత్రం శ్యామ్‌సంగ్ రిప్లినెష్ బెటర్ అని నిపుణులు తెలియజేస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X