'కర్వ్' ని దెబ్బతీసేందుకు 'హెచ్‌టిసి స్నాప్'

Posted By: Staff

'కర్వ్' ని దెబ్బతీసేందుకు 'హెచ్‌టిసి స్నాప్'

 

బ్లాక్‌బెర్రీ కర్వ్ మాదిరే మార్కెట్లోకి హెచ్‌టిసి విండోస్ స్మార్ట్‌ఫోన్‌ 'హెచ్‌టిసి స్నాప్' ని విడుదల చేస్తుంది. హెచ్‌టిసి స్నాప్ మొబైల్ యూజర్స్‌కు గ్రేట్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను పెద్ద స్క్రీన్‌తో పాటు, మంచి లుక్‌ దీని సొంతం. మొబైల్ బరువు 120 గ్రాములు. 'హెచ్‌టిసి స్నాప్' విండోస్ ఫోన్‌తో పాటు, మొబైల్ 6.1 స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది.

మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను క్వాలికామ్ 528MHz MSM 7225 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇంటర్నల్‌గా మొబైల్‌లో 192 MB RAMని అమర్చడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను మొబైల్ స్క్రీన్ సైజు 2.4 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 2.0 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు.

ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 22,000గా నిర్ణయిండమైంది. వన్ ఇండియా మొబైల్ పాఠకుల కొసం దీని ప్రత్యేకతలు క్లుప్తంగా..

హెచ్‌టిసి స్నాప్ మొబైల్ ప్రత్యేకతలు:

* ప్రాససెర్: Qualcomm MSM 7225, 528 MHz

* ఆపరేటింగ్ సిస్టమ్: Windows Mobile 6.1 Standard

* మెమరీ: 256MB ROM, 192 MB RAM

* విస్తరించుకునే మెమరీ: SDHC capable MicroSD slot

* చుట్టుకొలతలు: 116,5 mm. x 61,5 mm. x 11,9 mm. (L x W x T)

* బరువు: 119,9 grams (including battery)

* డిస్ ప్లే: 2,4″ QVGA (320×240)

* బ్యాటరీ: 1500mAh Li-Ion

* నెట్ వర్క్: HSDPA – WCDMA 900/1200 MHz, GSM - GPRS - EDGE 900 / 1800 / 1900 MHz

* కనెక్టివిటీ: Bluetooth 2.0 with EDR, Wi-Fi 802.11 b/g, GPS / AGPS

* కెమెరా: 2.0 megapixel, with video capture

* యూజర్ ఇంటర్‌ఫేస్: full exposed QWERTY keyboard (with offset keys), and Jog ball

* బ్యాటరీ టైమింగ్స్: Talk time up to 8.5 hours GSM / up to 5 hours WCDMA,

Standby time up to 15.8 days GSM / up to 20 days WCDMA

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot