బిజినెస్‌మేన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌కు విశేష స్పందన!!

Posted By: Super

బిజినెస్‌మేన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌కు విశేష స్పందన!!

 

బిజినెస్‌మేన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌కు విశేష స్పందన లభించిందని సెల్‌కాన్ ఎండీ వై.గురు ఒక ప్రకటనలో తెలిపారు. విడుదల చేసిన స్వల్పకాలంలోనే వేలాది వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, ప్రపంచ ఆండ్రాయిడ్ మార్కెట్ డౌన్‌లోడ్స్‌లో ఈ అప్లికేషన్ 53వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. బిజినెస్‌మేన్ హెక్సా ప్లాటినమ్ డిస్క్ ఈవెంట్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ అప్లికేషన్‌ను సెల్‌కాన్ ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా బిజినెస్‌మేన్ సినిమాకు సంబంధించి వాల్ పేపర్స్‌ను, ట్రైలర్స్‌ను, సినిమాకు సంబంధించిన ఇతర విషయాలను వీక్షించవచ్చని పేర్కొన్నారు. తమ సంస్థ నుంచి త్వరలో విడుదల కానున్న మరో 2 ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఈ అప్లికేషన్‌ను ప్రమోట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot